Mandadi : తమిళ్ రా & రస్టిక్ ‘మండాడి’ సినిమా తెలుగులో కూడా.. ఎప్పుడంటే..

ఈ సినిమాలో సుహాస్ పవర్ ఫుల్ విలన్ గా నటించబోతున్నాడు. (Mandadi)

  • Published on- July 19, 2026 / 10:11 AM IST

Mandadi

Mandadi : ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ పై ఎల్రెడ్ కుమార్ నిర్మాణంలో మతిమారన్ పుగళేంది తెరకెక్కిస్తున్న తమిళ సినిమా ‘మండాడి’. ఈ సినిమాలో తమిళ నటుడు సూరి తో పాటు తెలుగు నటుడు సుహాస్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాలో సుహాస్ పవర్ ఫుల్ విలన్ గా నటించబోతున్నాడు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో పడవల పోటీలు, యాక్షన్ సీక్వెన్స్ లతో రా & రస్టిక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి వచ్చిన కంటెంట్ మెప్పించింది. సుహాస్, సూరి పాత్రలు, ఆ కారెక్టర్స్ మేకోవర్ అదిరిపోయింది. ‘మండాడి’ మూవీని సెప్టెంబర్ 10న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ సినిమాని అదే రోజు విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా పాన్ ఇండియా రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.

Also Read : Pavithra Puri : ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ కూతురు.. ప‌విత్ర స్ట‌న్నింగ్ ఫోటోలు..

ఈ సినిమాని తెలుగులో మైత్రి మూవీస్ రిలీజ్ చేయబోతోంది. ఏపీ, తెలంగాణలో ఈ సినిమాని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి భారీ ఎత్తున రిలీజ్ చేయనుంది. ఇక ఈ సినిమాలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించగా సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్.. పలువురు కీలక పాత్రలను పోషించారు.