ఇంకా ICU లోనే బాలు.. తాజా హెల్త్ బులెటిన్ విడుదల..
- sekhar
- Published On : August 24, 2020 / 06:54 PM IST
SPB Health Condition: కరోనా బారిన పడిన గాన గంధర్వుడు, సుప్రసిద్ధ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం క్షేమంగా తిరిగి రావాలని దేశం మొత్తం ప్రార్థనలు చేస్తోంది. బాలు ప్రస్తుతం చెన్నై ఎం.జి.ఎం హెల్త్ కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆసుపత్రి వర్గాలవారు బాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
బాలు ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుంది.. వెంటిలేటర్, ఎక్మో సాయంతోనే ఎస్పీబీకి ఐసీయూలో చికిత్స కొనసాగిస్తున్నాం. నిపుణులైన వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుంది. అని ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి.
బాలు ఆరోగ్యంగా తిరిగి రావాలని సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ప్రార్థనలు చేస్తున్నారు.
