సంతోషాన్నిచ్చే వార్త.. బాలు ఆరోగ్యం గురించి ఎస్పీ చరణ్..
- sekhar
- Updated on- August 21, 2020 / 09:29 PM IST
SP Balasubrahmanyam Health Update: కరోనా మహమ్మారితో పోరాడుతున్న లెజండరీ సింగర్ ఎస్పీ బాల సుబ్రమణ్యం ఆరోగ్యానికి సంబంధించి తాజాగా ఎంజీఎం ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
బాలు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి.
బాలు ఆరోగ్యంపై ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తాజా సమాచారం తెలియజేశారు.
‘‘గురువారం నాన్నగారి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండగా, ఇప్పుడు స్థిరంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అంటే దీనర్థం ఆయన పూర్తిగా కోలుకున్నారని కాదు. వైద్యుల బృందం మాత్రం ఆయన ఆరోగ్యం మెరుగుపడే విషయమై ఎంతో నమ్మకంతో ఉన్నారు. మీ అందరి ప్రార్థనల వల్ల నాన్న ఆరోగ్యం స్థిరంగా ఉంది. ఈ పరిణామం మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది.
మా కుటుంబంపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’’.. అని తెలిపారు ఎస్పీ చరణ్.
