Sravana Bhargavi : వెనక్కి తగ్గిన శ్రావణ భార్గవి.. ఆ వీడియో డిలీట్.. మరో వీడియో రిలీజ్
ఎట్టకేలకు సింగర్ శ్రావణ భార్గవి వెనక్కి తగ్గింది. వివాదానికి కారణమైన ఆ వీడియోని డిలీట్ చేసింది. తనకు అన్నమాచార్యులు అంటే ఎంతో గౌరవం అని చెప్పింది. ఈ వివాదం మరింత ముదరడం ఇష్టం లేదంది. మరో కొత్త వీడియోను విడుదల చేసింది.
- Naveen
- Published On : July 23, 2022 / 10:35 PM IST
Sravana Bhargavi
Sravana Bhargavi : ఎట్టకేలకు సింగర్ శ్రావణ భార్గవి వెనక్కి తగ్గింది. వివాదానికి కారణమైన ఆ వీడియోని డిలీట్ చేసింది. తిరుపతిలో కేసు నమోదు కావడంతో ఆమె వెనక్కి తగ్గింది. అన్నమయ్య కీర్తనల వీడియోని సోషల్ మీడియా నుంచి తొలగించింది. సారీ చెప్పి మరీ ఆ వీడియోని డిలీట్ చేసింది శ్రావణ భార్గవి. తనకు అన్నమాచార్యులు అంటే ఎంతో గౌరవం అని చెప్పింది. ఈ వివాదం మరింత ముదరడం ఇష్టం లేదంది.
అన్నమయ్య కీర్తనను తొలగించి ఆ స్థానంలో వేణు నాదాన్ని జోడించి మరో కొత్త వీడియోను విడుదల చేసింది. ఒకపరి కీర్తనను తనపై చిత్రీకరించుకుంది శ్రావణ భార్గవి. ఇదే వివాదానికి దారితీసింది. అన్నమయ్య వంశస్తులు శ్రావణ భార్గవిపై భగ్గుమన్నారు. శ్రీవారి అభిషేక సేవ కీర్తనను తనపై చిత్రీకరించుకోవడం ఏంటని ప్రశ్నించారు. శ్రీవారి పాటను, భక్తి గీతాన్ని.. శృంగార గీతంగా మార్చి సాంగ్ చేశారని మండిపడ్డారు. భక్తి గీతాన్ని అశ్లీల గీతంగా మార్చేశారని ఫైర్ అయ్యారు. ఆ పాటలో అభ్యంతకర దృశ్యాలు ఉన్నాయని, శ్రావణ భార్గవి తన తప్పు తెలుసుకోవాలని, వెంటనే ఆ వీడియోని సోషల్ మీడియా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
Sravana Bhargavi: “ఈ పాటలో అశ్లీలం కనిపిస్తోంది.. శ్రావణ భార్గవి తప్పు తెలుసుకోవాలి”
అయితే అన్నమయ్య వంశీయుల పట్ల శ్రావణ భార్గవి దురుసుగా మాట్లాడింది. దీంతో ఆమెపై హిందువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రావణ భార్గవిపైన తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వివాదం రేపిన అన్నమయ్య కీర్తన వీడియోని సోషల్ మీడియా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
అన్నమయ్య కీర్తను శ్రావణ భార్గవి తనపై చిత్రీకరించుకోవడాన్ని అన్నమయ్య భక్తులు కూడా తప్పుపట్టారు. శ్రావణ భార్గవిని తిరుమలలో అడుగుపెట్టనివ్వబోమని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఓవైపు పోలీస్ కేసు, మరోవైపు వార్నింగ్ లు.. ఈ క్రమంలో శ్రావణ భార్గవి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. సారీ చెప్పి మరీ తన వీడియోని తొలగించారు.
తీవ్ర వివాదానికి కారణమైన వీడియో ఇదే…
