Comrade Kalyan : సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేసిన‌ శ్రీవిష్ణు ‘కామ్రేడ్ క‌ళ్యాణ్’.. ఐదు బాష‌ల్లో.. నెల‌లోపే..

Comrade Kalyan : కామెడీకి పెట్టింది పేరైన శ్రీవిష్ణు న‌టించిన లేటెస్టు మూవీ కామ్రేడ్ కళ్యాణ్ ఓటీటీలోకి వ‌చ్చేసింది.

Sree Vishnu Comrade Kalyan streaming on amazon prime

Comrade Kalyan : కామెడీకి పెట్టింది పేరైన శ్రీవిష్ణు న‌టించిన లేటెస్టు మూవీ ‘కామ్రేడ్ కళ్యాణ్’. జానకిరామ్ మారెళ్ల ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. మహిమా నంబియార్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 9న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. థియేట‌ర్ల‌లో న‌వ్వుల‌ను పంచింది.

ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వ‌స్తుందా? అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న వారికి శుభ‌వార్త ఇది. ఈ చిత్రం ఎలాంటి హ‌డావుడి లేకుండా సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేసింది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం నేటి (అక్టోబ‌ర్ 30) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది.

Aadarsha Kutumbam Review : ‘ఆదర్శ కుటుంబం AK47’ మూవీ రివ్యూ.. వెంకీ కామెడీ.. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్!

రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే, సత్య తదితరులు కీలక పాత్రల్లో న‌టించారు. కోన వెంకట్ సమర్పణలో వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి ఈ సినిమాను నిర్మించారు. థియేట‌ర్ల‌లో న‌వ్వులు పంచిన ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి సంచ‌ల‌నాల‌ను సృష్టిస్తుందో చూడాలి.