Sree Vishnu : ఓటీటీలోకి వచ్చేసిన శ్రీవిష్ణు కామెడీ సినిమా.. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది..?
ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. (Sree Vishnu)
- Saketh U
- Published On : March 20, 2026 / 11:11 AM IST
Sree Vishnu
Sree Vishnu : శ్రీవిష్ణు వరుసగా కామెడీ సినిమాలతో దూసుకుపోతున్నాడు. శ్రీ విష్ణు, నయన్ సారిక జంటగా తెరకెక్కిన సినిమా ‘విష్ణు విన్యాసం’. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మాణంలో యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. విష్ణు విన్యాసం సినిమా ఇటీవల ఫిబ్రవరి 27న థియేటర్స్ లో విడుదల అయింది.
వాస్తు, జాతకాలు నమ్మే వ్యక్తి పాత్రలో శ్రీవిష్ణు ఫుల్ కామెడీతో ఈ సినిమాలో మెప్పిస్తాడు. హీరోయిన్ తో వచ్చే ట్విస్ట్, క్లైమాక్స్ లో ట్విస్టులతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. థియేటర్స్ లో ఈ సినిమా దాదాపు 20 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.
Also See : Manchu Vishnu Wife : ఉగాది స్పెషల్.. ఫ్యామిలీతో ఫొటోలు షేర్ చేసిన మంచు విష్ణు భార్య..
విష్ణు విన్యాసం సినిమా నేడు మార్చ్ 20 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో కేవలం తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు ఈ సినిమాని ఓటీటీలో చూసేయండి..
