×
Ad

Sree Vishnu : ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్.. శ్రీవిష్ణు కష్టం ఎవరికీ రాకూడదు.. పాపం..

శ్రీ విష్ణు హీరోగా చేసిన రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కాబోతున్నాయి.(Sree Vishnu)

  • Published On : February 12, 2026 / 08:15 AM IST

Sree Vishnu

Sree Vishnu : శ్రీవిష్ణు ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. కామెడీ జానర్స్ తో సినిమాలు తీస్తూ ప్రేక్షకులని నవ్విస్తూ యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు శ్రీ విష్ణు. దీంతో ఈ హీరో రాబోయే సినిమాలపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. అయితే శ్రీ విష్ణు హీరోగా చేసిన రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కాబోతున్నాయి.(Sree Vishnu)

శ్రీ విష్ణు హీరోగా నటించిన మృత్యుంజయ్ సినిమా టీజర్ నిన్నే విడుదల చేసి ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న మృత్యుంజయ్ సినిమా ఫిబ్రవరి 27న రిలీజ్ కాబోతుందని ప్రకటించారు.

Also Read : Lavanya Tripathi : బాబు పుట్టిన తర్వాత మొదటిసారి మీడియా ముందుకు మెగా కోడలు.. లావణ్య త్రిపాఠి ఫొటోలు..

శ్రీ విష్ణు నటించిన మరో సినిమా విష్ణు విన్యాసం కూడా ఫిబ్రవరి 27 కే రిలీజ్ ప్లాన్ చేసారు. డేట్ అధికారికంగా ప్రకటించకపోయినా ఫిబ్రవరిలోనే రిలీజ్ అని ప్రకటించారు. ఇటీవల సినిమా రిలీజ్ డేట్స్ ని ఓటీటీ వాళ్ళు డిసైడ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలా మృత్యుంజయ్ సినిమాని నెట్ ఫ్లిక్స్ తీసుకోగా విష్ణు విన్యాసం సినిమాని అమెజాన్ ప్రైమ్ తీసుకుంది. ఈ రెండు ఓటీటీలు ఫిబ్రవరి 27 నే సినిమా రిలీజ్ చేయాలని కండిషన్ పెట్టారట.

దీంతో శ్రీ విష్ణు మృత్యుంజయ్, విష్ణు విన్యాసం సినిమాలు రెండూ ఫిబ్రవరి 27 నే రిలీజ్ కానున్నాయి. అయితే శ్రీ విష్ణు ఇప్పటికే నిర్మాతలతో మాట్లాడి చూశారట. విష్ణు విన్యాసం వాయిదా వేద్దాం కొన్ని రోజులు అని అడిగి చూశారట. వాళ్ళు మాత్రం ఒప్పుకోలేదు. చివరి నిమిషంలో ఏదైనా ఒక సినిమా వాయిదా పడుతుందేమో చూడాలి.

Also Read : Lavanya Tripathi : ఆ ట్వీట్ గురించి క్లారిటీ ఇచ్చిన మెగా కోడలు.. నా ఫ్యామిలీని ఎవరైనా అంటే..

ఒకవేళ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే కనక ప్రమోషన్స్ లో రెండు టీమ్స్ కి సమన్యాయం చేయడానికి శ్రీ విష్ణు కష్టపడాల్సిందే. ఒకేసారి ఒకే హీరోవి రెండు సినిమాలు రిలీజ్ అయితే ఆ సినిమా కలెక్షన్స్ కి కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది.