Sreeleela: చాలా సీన్స్ ఫ్యాన్స్ కోసమే.. పాపం పవన్ కళ్యాణ్ గారు.. హరీష్ శంకర్ ఆ మాట అనగానే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన శ్రీలీల(Sreeleela).
- V Santhosh Kumar
- Updated on- March 17, 2026 / 12:59 PM IST
Sreeleela interesting comments about pawan kalyan
Sreeleela: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా సెట్‌లో చాలా రిజర్వ్‌డ్ గా, మొహమాటంగా ఉంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ, ఆయన తన అభిమానుల సంతోషం కోసం తన స్వభావాన్ని కూడా పక్కన పెట్టి మరి కొన్ని పనులు చేస్తారని తాజాగా స్టార్ బ్యూటీ శ్రీలీల చెప్పుకొచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మార్చి 19న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీల(Sreeleela), సెట్‌లో జరిగిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
Ariyana Glory: పవన్ కళ్యాణ్ మేనియా.. ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ లో అరియానా క్రేజీ ఫోటోలు
పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా చాలా మొహమాటంగా ఉంటారు. సినిమాలో కొన్ని మాస్ సీన్స్ లేదా ఎనర్జిటిక్ మూమెంట్స్ చేయడానికి ఆయన ఒక్కోసారి ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ, దర్శకుడు హరీష్ శంకర్ గారు పక్క నుంచి వచ్చి.. ‘సార్, ఈ సీన్ ఫ్యాన్స్ కోసం చేయాల్సిందే’ అని ఒక్క మాట అనేవారు. ఆ ‘ఫ్యాన్స్’ అనే పదం వినగానే పవన్ గారు వెనకాడకుండా వెంటనే ఓకే చెప్పేసి ఆ సీన్ చేసేవారు” అని ఆమె చెప్పుకొచ్చారు. అభిమానుల మీద ఆయనకు ఉన్న ప్రేమ చూసి తాను ఆశ్చర్యపోయానని శ్రీలీల పేర్కొన్నారు.
ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మార్క్ మేనరిజమ్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించేలా ఉండబోతున్నాయని, హరీష్ శంకర్ గారు పక్కా ప్లాన్‌తో ప్రతి సీన్‌ను డిజైన్ చేశారని ఆమె తెలిపారు. అభిమానుల కోసం పవన్ కళ్యాణ్ గారు తన కంఫర్ట్ జోన్ దాటి చేసిన ఆ సన్నివేశాలు థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయమని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు శ్రీలీల చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ వైరల్‌గా మారాయి. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి.
