×
Ad

Sreeleela: పాపం.. శ్రీలీలది నిజంగా బ్యాడ్ లక్కే.. సూపర్ హిట్ సినిమా మిస్ అయ్యింది!

నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమాను మిస్ చేస్తున్న స్టార్ బ్యూటీ శ్రీలీల(Sreeleela).

Sreeleela is the first choice for anaganaga oka raju movie

  • అనగనగా ఒక రాజులో ముందు హీరోయిన్ శ్రీలీల
  • వరుస ప్లాప్స్ వల్ల సినిమా నుంచి తొలగించిన మేకర్స్
  • బ్యాడ్ లక్ సూపర్ హిట్ సినిమాను మిస్ చేసుకుంది అంటూ కామెంట్స్

Sreeleela: సినిమా ఇండస్ట్రీలో విజయం సాదించాలి అంటే కష్టంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. అలా ఉంటేనే ఇక్కడ విజయాలు దక్కుతాయి. అలాంటి అదృష్టం లేకనే లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) వెనుకబడిపోతోంది. ధమాకా సూపర్ హిట్ తరువాత వరుస అవకాశాలు దక్కించుకుంది ఈ బ్యూటీ. కానీ, విజయాలు మాత్రం వరించలేదు అనే చెప్పాలి. మహేష్ బాబు, నితిన్, రవి తేజ, శివకార్తికేయన్ లాంటి హీరోలతో చేసిన కూడా హిట్ దక్కలేదు.

అయితే, తాజాగా శ్రీలీల గురించి మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే, శ్రీలీల నటించిన సినిమాలు హిట్ కాకపోవడం కాదు రీసెంట్ గా వచ్చిన ఒక సూపర్ హిట్ సినిమా నుంచి ఆమెను తీసేశారట మేకర్స్. అదే అనగనగా ఒక రాజు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించిన ఈ సినిమాలో టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా నటించాడు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాధించింది.

Rashmika Mandanna: నాకు చెప్పింది ఒకటి.. చేసింది ఒకటి.. సికిందర్ ప్లాప్ పై రష్మిక కామెంట్స్ వైరల్

నిజానికి, ఈ సినిమాలో ముందుగా శ్రీలీలను హీరోయిన్ గా అనుకున్నారు. అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ, అప్పటికే శ్రీలీలకు వరుస ప్లాప్స్ పడుతుండటంతో ఆమెను ఈ సినిమాను తప్పించారు మేకర్స్. ఆమె స్థానంలో మరో క్రేజీ బ్యూటీ మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. రీసెంట్ గా వచ్చిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది. కేవలం 4 రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించి నవీన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

రానున్న రోజుల్లో ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్ లో చేరనుంది అంటూ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇలా ఒక సూపర్ హిట్ సినిమా నుంచి తప్పుకుంది శ్రీలీల. ఇక ఈ న్యూస్ తెలిసిన ఆమె ఫ్యాన్స్ నిజంగా శ్రీలీలది బ్యాడ్ లక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ బ్యూటీ హిట్ ఎప్పుడు కొడుతుంది అనేది చూడాలి.