Sreeleela: ఉస్తాద్ భగత్ సింగ్‌తో శ్రీలీల జాతర.. పవన్ సినిమాకు తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం శ్రీలీల(Sreeleela) తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Sreeleela Remuneration Goes Viral in Industry Circles

  • మరోసారి వైరల్ అవుతున్న శ్రీలీల రెమ్యునరేషన్
  • పవన్ కళ్యాణ్ కోసం కాస్త తగ్గిన బ్యూటీ
  • పవన్ క్రేజ్ కారణం అంటున్న విశ్లేషకులు

Sreeleela: టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నారు. ‘పెళ్లి సందD’తో తెరంగేట్రం చేసి, ‘ధమాకా’తో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటిన ఈ స్టార్ బ్యూటీ.. ఇప్పుడు ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్‌తో కలిసి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో నటించే క్రేజీ ఆఫర్ ను దక్కించుకుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మాస్ ఎంటర్టైనర్ లో రాశి ఖన్నా మరో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య మార్చి 19న థియేటర్లలోకి రానుంది.

Maharaja Sequel: మహారాజా ఈజ్ బ్యాక్.. విజయ్ సేతుపతి సెన్సేషనల్ హిట్‌కు సీక్వెల్

ఈనేపథ్యంలోనే తాజాగా శ్రీలీల(Sreeleela) గురించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కడుతోంది. అదే, ఉస్తాద్ భగత్ సింగ్ కోసం శ్రీలీల తీసుకున్న రెమ్యునరేషన్. ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం శ్రీలీల రూ.2.5 నుంచి రూ.3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుందట. గతంతో పోలిస్తే ఇది తక్కువే అని చెప్పాలి. శ్రీలీల నటించిన ‘జూనియర్’ సినిమాకి ఏకంగా రూ 4 కోట్లు, రవి తేజతో చేసిన మాస్ జాతర చిత్రానికి రూ.3 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకుంది.

వాటితో పోలిస్తే ఉస్తాద్ భగత్ సింగ్ కోసం తీసుకుంది కాస్త తక్కువే అని చెప్పాలి. దానికి కారణం, పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్ సినిమాలో ఛాన్స్ రావడమే అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక కేవలం తెలుగులోనే కాకుండా.. బాలీవుడ్ పై కూడా దృష్టి పెట్టింది శ్రీలీల. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ అమ్మడు కార్తీక్ ఆర్యన్ సరసన తు మేరీ జిందగీ హై, ఇబ్రహీం అలీ ఖాన్‌తో దిలేర్ వంటి సినిమాలు చేస్తోంది.