Srikanth Odela : ఏషనాగుల సాంగ్.. ఆట సందీప్ పై విమర్శలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల..
ఈ ప్రెస్ మీట్ లో మీడియా దీనిపై ప్రశ్నించడంతో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సమాధానమిచ్చాడు. (Srikanth Odela)
Srikanth Odela
Srikanth Odela : నాని ది ప్యారడైజ్ సినిమా నుంచి ఇటీవల ఏషనాగుల కట్ట మీద.. అనే మాస్ సాంగ్ ని రిలీజ్ చేసారు. ఈ సాంగ్ పెద్ద హిట్ అయింది. సోషల్ మీడియాలో అయితే రీల్స్ రూపంలో మోత మోగిపోయింది. ఈ సాంగ్ ని ఆట సందీప్ మాస్టర్ కంపోజ్ చేసారు. అయితే ఇంత ఫాస్ట్ సాంగ్ కి, ఊపు ఉన్న సాంగ్ కి సింపుల్ స్టెప్స్, స్లో స్టెప్స్ వేయించాడు అంటూ సందీప్ మాస్టర్ పై పలువురు విమర్శలు కూడా చేసారు. నాని ఫ్యాన్స్ కూడా సందీప్ కొరియోగ్రఫీపై బాగోలేదు అంటూ కామెంట్స్ చేసారు.
నేడు ది ప్యారడైజ్ సినిమా మొదటి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో మీడియా దీనిపై ప్రశ్నించడంతో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సమాధానమిచ్చాడు.
Also Read : Nani : ‘ది ప్యారడైజ్’ సినిమాకు ట్రైలర్ లేదు.. ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన నాని..
శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. అవును ఆ సాంగ్ స్టెప్స్ కి నెగిటివ్ వచ్చింది. కానీ అది నా నిర్ణయమే. నేనే చెప్పాను స్టెప్స్ స్లోగా ఉండాలి అని. ఓ ఎగరొద్దు, డ్యాన్స్ అంటే స్టేజి బద్దలైనట్టు ఎగరొద్దు అని చెప్పాను. పెళ్లిల్లో సింపుల్ బరాత్ లా వేసే స్టెప్స్ లా ఉండాలి అని నేనే చెప్పాను. సాంగ్ అయ్యాక మొదట విమర్శలు వస్తాయి అని ముందే నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఆ విమర్శలు లేవు. అందరూ ఆ సాంగ్స్ ని, స్టెప్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు అని తెలిపాడు.
