ఫ్యామిలీ మూవీస్ తో తెలుగు ఆడియన్స్ లో మంచి పేరు తేచ్చుకున్న హీరో ‘శ్రీకాంత్ ఓ వైపు సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో నటిస్తూనే మరోవైపు హీరోగా విభిన్న కథా చిత్రాలు చేస్తున్నాడు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మార్షల్’. జై రాజా సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ ను ఆదివారం ( మే 6, 2019) న విడుదల చేశారు. ఈ సినిమాలో శ్రీకాంత్ డాక్టర్ పాత్రలో కనిపించారు. ఇందులోని సన్నివేశాలని బట్టి చూస్తుంటే ఈ చిత్రం మెడికల్ నేపథ్యంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని అర్దమవుతుంది.
ఈ భూమ్మీద పుట్టి చనిపోయే ప్రతి మనిషి.. మొట్టమొదటగా, చిట్టచివరగా చూసేది డాక్టర్నే. హ్యూమన్ బాడీ ని సృష్టించేది దేవుడే అయినా అప్పగించేది డాక్టర్‌కే అన్న డైలాగ్‌తో టీజర్ ప్రారంభం అయింది. అభయ్, మేఘా, రష్మి చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘మార్షల్’ టీజర్‌ను విడుదల చేశారు.