Mansion House Mallesh OTT: శోభనం రాత్రి షాకింగ్ నిజం.. ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఎలాంటి ప్రకటన లేకుండా సైలెంట్ గా ఓటీటీకి వచ్చేసిన లేటెస్ట్ టాలీవుడ్ మూవీ మెన్షన్ హౌస్ మల్లేష్(Mansion House Mallesh OTT).

srinath maganti mansion house mallesh movie now streaming on amazon prime

Mansion House Mallesh OTT: టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ శ్రీనాథ్ మాగంటి హీరోగా నటించిన తాజా చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్(Mansion House Mallesh OTT)’. పక్కా గ్రామీణ నేపథ్యంలో బాల సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, మార్చి 6న థియేటర్లలో విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే, ఇప్పుడు ఈ చిత్రం సైలెంట్‌గా ఓటీటీ బాట పట్టింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్న ఈ మూవీ, వచ్చే వారం నుండి ‘సన్ నెక్స్ట్’ లో కూడా స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్స్ లో ప్లాప్ గా నిలిచిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.

Shivani Nagaram: నీలి రంగు దుస్తుల్లో మెరిసిపోతున్న శివాని నాగారం.. ఫోటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

కథ విషయానికొస్తే: పల్లెటూరికి చెందిన మల్లేష్ (శ్రీనాథ్ మాగంటి) చిన్నప్పటి నుంచే తాగుడికి బానిసవుతాడు. తన బావ చిన్న పటేల్ (రాజేష్)తో అతడికి నిరంతరం గొడవలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో తల్లి బలవంతం మీద జ్యోతి (గాయత్రి రమణ)ని వివాహం చేసుకుంటాడు. అయితే, శోభనం రాత్రి మల్లేష్‌కి ఒక ఊహించని షాకింగ్ విషయం తెలుస్తుంది. ఆ సంఘటన మల్లేష్ జీవితాన్ని ఏ మలుపు తిప్పింది? తన మగతనాన్ని నిరూపించుకుని, తన భూమిని దక్కించుకోవాల్సిన పరిస్థితి ఎదురైనప్పుడు ఆ యువకుడు ఏం చేశాడు? అనే అంశాలను దర్శకుడు వినోదాత్మక ధోరణిలో ఈ చిత్రంలో ఆవిష్కరించారు.