Star Actress : ఈ ఫొటోలో చిన్న పాపని గుర్తు పట్టారా?.. 60 ఏళ్ళు అంటూ బర్త్ డే విషెష్ చెప్తూ షేర్ చేసిన స్టార్ హీరోయిన్..
తాజాగా ఓ స్టార్ హీరోయిన్ వాళ్ళ నాన్న 60వ పుట్టిన రోజున చిన్నప్పుడు తనని వాళ్ళ నాన్న ఎత్తుకున్న ఫోటో షేర్ చేసి స్పెషల్ విషెష్ చెప్పింది.
- Saketh U
- Published On : July 15, 2024 / 07:03 AM IST
Star Actress shares her childhood photo with father and wishes him find that actress
Find the Star Actress : ఇటీవల అప్పుడప్పుడు స్టార్ నటీనటులు, సెలబ్రిటీలు తమ చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తమ ఇంట్లో వాళ్ళతో ఉన్న చిన్నప్పటి ఫోటోలు స్పెషల్ డేస్ లో షేర్ చేసి ఎమోషనల్ పోస్టులు చేస్తారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ వాళ్ళ నాన్న 60వ పుట్టిన రోజున చిన్నప్పుడు తనని వాళ్ళ నాన్న ఎత్తుకున్న ఫోటో షేర్ చేసి స్పెషల్ విషెష్ చెప్పింది.
లేడి పవర్ స్టార్ అంటేనే సాయి పల్లవి అని అందరూ ఫిక్స్ అయిపోయారు. చేసిన తక్కువ సినిమాలైనా ఆ రేంజ్ లో స్టార్ డమ్, ఎక్కువమంది ఫ్యాన్స్ ని సంపాదించుకుంది. సాయి పల్లవి సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. త్వరలో నాగ చైతన్య సరసన తండేల్ సినిమాలో కనిపించనుంది. సోషల్ మీడియాలో సాయి పల్లవి చాలా అరుదుగా ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.
తాజాగా సాయి పల్లవి తన తండ్రి సెంతామరై పుట్టిన రోజు సందర్భంగా పాత ఫోటోలు షేర్ చేస్తూ.. 60వ పుట్టిన రోజు శుభాకాంక్షలు నాన్న. మాకు ప్రశాంతమైన జీవితం ఇచ్చినందుకు థ్యాంక్యూ. మీ జీన్స్ నుంచి ఫుట్ బాల్ ఆడటానికి బలమైన కాళ్ళు, మైగ్రేన్.. ఇచ్చినందుకు థ్యాంక్యూ. చాలా సెన్సిటివ్ గా ఉండే మమ్మల్ని స్ట్రాంగ్ గా మార్చినందుకు, నాకు, పూజాకు స్ఫూర్తిని ఇచ్చినందుకు ధన్యవాదాలు అని తెలిపింది. వాళ్ళ నాన్న పాత ఫొటోలతో పాటు తనని ఎత్తుకున్న ఫోటో కూడా షేర్ చేసింది. ఫోటోలు, చేసిన పోస్ట్ తో సాయి పల్లవి వాళ్ళ నాన్న ఒకప్పుడు ఫుట్ బాల్ ప్లేయర్ అని తెలుస్తుంది.
