×
Ad

Ustaad Bhagat Singh : పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ లో నటించిన యాంకర్.. ఎవరో తెలుసా?

తాజాగా ఓ యాంకర్ తాను ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటించాను అని తెలిపింది. (Ustaad Bhagat Singh)

  • Published On : February 26, 2026 / 11:17 AM IST

Ustaad Bhagat Singh

  • ఉస్తాద్ భగత్ సింగ్ మార్చ్ 26 రిలీజ్
  • ఆ సినిమాలో నటించిన యాంకర్
  • ఇంటర్వ్యూలో వెల్లడి

Ustaad Bhagat Singh : హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మార్చ్ 26 రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఈ సినిమాలో చాలా మంది ఊహించని నటీనటులను పలు పాత్రలకు క్యాస్ట్ చేసినట్టు తెలుస్తుంది.

తాజాగా ఓ యాంకర్ తాను ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటించాను అని తెలిపింది. ఇంతకీ ఆ యాంకర్ ఎవరో అనుకుంటున్నారా?

Also Read : Geetha Bhagat : ఆయన చెప్పింది నిజం.. చిరంజీవి ఇష్యూపై యాంకర్ గీత భగత్ కామెంట్స్..

ఆ యాంకర్ ఎవరో కాదు గీత భగత్. సినిమా ఈవెంట్స్, సెలబ్రిటీ ఇంటర్వ్యూలు హోస్ట్ చేస్తూ స్టార్ యాంకర్ గా దూసుకుపోతుంది. కెరీర్ మొదట్లో సినిమాల్లో కూడా నటించిన గీతా భగత్ ఇప్పుడు కేవలం యాంకర్ గానే చేస్తుంది. ఇటీవలే నిర్మాతగా కూడా మారింది.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో గీత భగత్ మాట్లాడుతూ..సినిమాలు, సీరియల్స్ లో చాలా ఆఫర్స్ వచ్చాయి. పెద్ద సినిమాల్లో కూడా ఆఫర్స్ వచ్చాయి కానీ నేనే నో చెప్పాను. నాకు యాంకరింగ్ కంఫర్ట్ గా ఉంది. అందుకే ఇదే చేసుకుంటున్నాను. గతంలో ఓ రెండు మూడు సినిమాల్లో యాంకర్ రోల్ చేశాను. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా యాంకర్ రోల్ చేశాను. చాలా చిన్న రోల్. ఆ సినిమా వచ్చినప్పుడు చూడొచ్చు. యాంకర్ రోల్ కాబట్టే చేశాను. ఒకవేళ సినిమాల్లో యాంకర్ రోల్ వస్తే మాత్రం చేస్తాను కానీ ఆర్టిస్ట్ గా అంటే చేయను అని తెలిపింది.

Also See : Abhinaya : బీచ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న నటి అభినయ.. ఫొటోలు..