Big Movies : హాలిడేస్ అన్నీ వదిలేసిన పెద్ద హీరోలు.. దసరా, దీపావళికి కూడా పెద్ద సినిమాలు లేకుండా చేశారుగా..

పోయిన హాలిడేస్ ఎలాగూ పోయాయి కానీ వచ్చే దసరా దీపావళికి స్టార్స్ ఎవరైనా వస్తారంటే అది కూడా అనుమానమే.

Star Hero Movies are not releasing on Holidays this year Dasara Diwali also No star Movies

Big Movies : కలెక్షన్లు రాబట్టే తెలుగు పండగలన్నీ పక్కనపెట్టేసి తర్వాత మాత్రం నేనంటే నేను అంటూ ఒకేసారి రిలీజ్ కి పోటీపడుతున్నారు స్టార్ హీరోలు ఈ మధ్య. సమ్మర్ తెలుగు సినిమాలకు పెద్ద సీజన్. అయితే ఈ సారి సమ్మర్ కి స్టార్ మూవీస్ ఏం రిలీజ్ చెయ్యలేదు. ఆగస్టు 15 లాంగ్ వీకెండ్ వదిలేసారు, వినాయకచవితిని అసలు పట్టించుకోనేలేదు. దసరాకి కూడా పెద్ద హీరోలు సినిమాలు రిలీజ్ కి రెడీగా లేవు. దీపావళికి ఏమన్నా ఉంటాయా అంటే అది కూడా డౌటే. ఈ సంవత్సరం పండగలకి, హాలీడేస్ కి పెద్ద హీరోలు థియేటర్లకి రావట్లేదు.

పోయిన హాలిడేస్ ఎలాగూ పోయాయి కానీ వచ్చే దసరా దీపావళికి స్టార్స్ ఎవరైనా వస్తారంటే అది కూడా అనుమానమే. దసరా టైమ్ లో అక్టోబర్ 10కి దేవర రిలీజ్ అవ్వాల్సింది కానీ దేవర సెప్టెంబర్ కి ప్రీపోన్ అవ్వడంతో తెలుగులో దసరాకి పెద్ద సినిమా రిలీజ్ లేకుండా పోయింది.

అసలు దసరాకి బాలయ్య మూవీ రిలీజ్ అవుతుందేమో అనుకన్నారంతా. కానీ ఎన్నికల వల్ల అదికాస్తా షూటింగ్ లేట్ అయి ఇంకా జరుగుతుండడంతో రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యేలేదు. దసరాకి పెద్ద సినిమాలు రిలీజ్ లేకపోవడంతో చిన్న, మీడియం రెండు సినిమాలు పోటీపడుతున్నాయి. ఒకటి గోపీచంద్, ఒకటి సుహాస్ సినిమాలు. గోపీచంద్, శ్రీనువైట్ల కాంబినేషన్లో విశ్వం మూవీ అక్టోబర్ 11న రిలీజ్ ప్లాన్ చేస్తే అదే రోజు సుహాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జనక అయితే గనక కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది.

Also Read : Devara : వామ్మో.. ‘దేవర’ తెలుగులో హిట్ కొట్టాలంటే అంత కలెక్ట్ చేయాలా? ఎన్టీఆర్‌కి భారీ టార్గెట్..

దసరా పోతే పోయింది. దీపావళికైనా పెద్ద సినిమా ఉంటుందంటే అది కూడా కుదిరేలా లేదు. దీపావళికి ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అవ్వడం లేదు. రెండు మిడ్ రేంజ్ సినిమాలు మాత్రం రిలీజ్ కాబోతున్నాయి. ఒకటి విశ్వక్ సేన్, మీనాక్షి జంటగా మెకానిక్ రాకీ రిలీజ్ కాబోతోంది. విశ్వక్ క్రేజ్ ఈ మధ్య బాగా పెరిగిపోవడంతో మెకానిక్ రాకీ మీద ఆడియన్స్ లో ఇంట్రస్ట్ క్రియేట్ అవుతోంది. లక్కీ భాస్కర్ కూడా దీపావళికే థియేటర్లోకొస్తోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి డైరెక్షన్లో సితార, శ్రీకర, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ లో తెరకెక్కుతున్న లక్కీ భాస్కర్ అక్టోబర్ 31న రిలీజ్ కాబోతోంది. పెద్ద సినిమాలు లేకపోవడంతో దీపావళికి ఈ 2 సినిమాలతో సరిపెట్టుకోవల్సిందే.

అయితే రాబోయే దసరాకి మన పెద్ద సినిమాల రిలీజ్ లేకపోయినా అక్టోబర్ 11న రజనీకాంత్ మోస్ట్ వెయిటింగ్ మూవీ వెట్టయ్యన్ రిలీజ్ అవుతోంది. రజనీకాంత్ వస్తున్నారని ఏకంగా సూర్యనే తన సినిమా కంగువని పోస్ట్ పోన్ చేస్తున్నారు.