Tabu: సముద్ర తీరాన ప్యాలెస్ లాంటి ఇల్లు కొన్న టబు.. దాని ప్రత్యేకతలు తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం

ముంబై సముద్రతీరాన ఖరీదైన ఫ్లాట్ కొన్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ టబు(Tabu).

star heroine Tabu buys an expensive building in Mumbai Versova

  • రియల్ ఎస్టేట్‌లో ‘ఐకాన్’ స్టార్ల బాటలో టబు
  • వెర్సోవాలో ఖరీదైన భవనం కొన్న టబు
  • 10 కోట్లతో సముద్ర తీరాన విలాసవంతమైన ఫ్లాట్!

Tabu: సినిమా స్టార్స్ తమ సంపాదనను రియల్ ఎస్టేట్ లో పెట్టడం ఇప్పుడు ఒక ట్రెండ్‌గా మారింది. కేవలం హీరోలే కాకుండా స్టార్ హీరోయిన్లు కూడా విలాసవంతమైన విల్లాలు, ఫ్లాట్లను కొనుగోలు చేస్తూ భవిష్యత్తు కోసం ఆస్తులను కూడబెడుతున్నారు. తాజాగా సీనియర్ నటి టబు సైతం ముంబైలో ఒక ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. ముంబైలోని వెర్సోవా ప్రాంతంలో సముద్ర తీరానికి అతి సమీపంలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌ను ఆమె దాదాపు పది కోట్ల నలభై లక్షల రూపాయల భారీ వ్యయంతో కొనుగోలు చేసినట్లు సమాచారం.

Nabha Natesh: చీరకట్టులో పరువాల విందు.. ఎద అందాలతో కట్టిపడేస్తున్న నభా నటేష్

ఈ విలాసవంతమైన అపార్ట్‌మెంట్ కోసం టబు(Tabu) కేవలం రిజిస్ట్రేషన్ ఫీజు కిందనే అరవై లక్షల రూపాయల వరకు ఖర్చు చేయడం విశేషం. మొత్తం ఇరవై నాలుగు అంతస్తులు కలిగిన రెండు భారీ టవర్లతో కూడిన ఈ వెంచర్‌లో జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి అత్యాధునిక వసతులు ఉన్నాయి. ముంబై నగరం మొత్తం అందంగా కనిపించేలా ఉండే ఈ ఫ్లాట్‌తో పాటు రెండు కార్లకు సరిపడా పార్కింగ్ స్థలం కూడా ఆమెకు దక్కింది. ఇప్పటికే ముంబై, హైదరాబాద్ నగరాల్లో సొంత ఇళ్లు ఉన్న టబుకు, వెర్సోవాలోని ఈ కొత్త ఫ్లాట్ మూడవ ఆస్తి కావడం విశేషం.

ఇక సినిమాల పరంగా చూస్తే టబు ఇప్పటికీ వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు. ఆమె నటించిన తాజా హిందీ చిత్రం ‘బూత్ బంగ్లా’ ఇటీవలే విడుదలై ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం విజయ్ సేతుపతి కథానాయకుడిగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’ అనే సినిమాలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు.