Suchitra Krishnamoorthi : ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. అయినా నా భర్తే నన్ను మోసం చేశాడు..
బాలీవుడ్ నటి, సింగర్ సుచిత్ర కృష్ణమూర్తి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన భర్త గురించి, వారి వివాహం గురించి మాట్లాడింది.
- Saketh U
- Published On : July 11, 2023 / 06:50 AM IST
Suchitra Krishnamoorthi sensational comments on her ex husband Shekhar Kapoor
Suchitra Krishnamoorthi : బాలీవుడ్ నటి, సింగర్ సుచిత్ర కృష్ణమూర్తి తాజాగా తన భర్త మోసం చేశాడంటూ గతం గురించి మాట్లాడింది. నటిగా, సింగర్ (Singer) గా బాలీవుడ్ లో అనేక సినిమాలతో మెప్పించింది. 1991లో ఓ మలయాళం సినిమాతో పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. 22 ఏళ్ళ వయసులోనే తనకంటే 25 ఏళ్ళు పెద్దయిన బాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కపూర్ (Shekhar Kapoor) ని ప్రేమించి పెళ్లి (Love Marriage) చేసుకుంది. అప్పటికే అతనికి ఒక విడాకులు (Divorce) అయ్యాయి. తన ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పినా సుచిత్ర అతన్ని పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి ఒక పాప కూడా ఉంది.
అయితే పెళ్ళైన 8 ఏళ్లకే వీరు విడిపోయారు. అప్పట్లో వీరి విడాకులకు కారణాలు వెల్లడించలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన భర్త గురించి, వారి వివాహం గురించి మాట్లాడింది.
KGF : జపాన్‌లో రిలీజ్ కాబోతున్న కేజీఎఫ్ సిరీస్.. RRR ని బీట్ చేస్తుందా..? సలార్ కోసమే రిలీజ్..?
సుచిత్ర కృష్ణమూర్తి మాట్లాడుతూ.. మాది సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని ఫ్యామిలీ. సినిమాల్లోకి వస్తా అంటే వద్దనే చెప్పినా వచ్చాను. నాకు శేఖర్ కపూర్ ముందు నుంచి ఇష్టం. నేను 19 ఏళ్ళ వయసులో అతన్ని కలిశాను. 22 ఏళ్ళకి అతన్ని పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకుంటే సినిమాలు మానేయాలి అన్నాడు. అతని కోసం నేను ఓకే చెప్పాను. మా ఇంట్లో కూడా శేఖర్ కపూర్ తో పెళ్లి వద్దన్నారు. అయినా అతన్ని కావాలనుకొని పెళ్లి చేసుకున్నాను.
కానీ మా మధ్య మనస్పర్థలు వచ్చాయి. నాకు తగిన గౌరవం ఇచ్చేవాడు కాదు. నన్ను అతను మోసం చేశాడు. పెళ్ళైన కొన్నాళ్లకే అతనితో విడిపోదాం అనుకున్నా. కానీ అప్పుడు నేను ప్రగ్నెంట్ అని తెలియడంతో ఇంకొన్నాళ్ళు అతన్ని భరించాల్సి వచ్చింది. ఆ తర్వాత మేం విడిపోయాం అని చెప్పింది. మరి ఈ వ్యాఖ్యలపై శేఖర్ కపూర్ ఏమన్నా స్పందిస్తాడేమో చూడాలి. అయితే విడిపోయిన తర్వాత కూడా తమ కూతురి కోసం వీరు అప్పుడప్పుడు కలుస్తున్నారు.
