Sudigali Sudheer : ‘సర్కార్’ షో విన్నర్స్ కి బైక్స్ అందించిన సుడిగాలి సుధీర్..

ఆహా ఓటీటీలో సర్కార్ అనే గేమ్ షో గత అయిదు సీజన్స్ నుంచి సక్సెస్ ఫుల్ గా సాగుతున్న సంగతి తెలిసిందే.(Sudigali Sudheer)

Sudigali Sudheer

Sudigali Sudheer : ఆహా ఓటీటీలో సర్కార్ అనే గేమ్ షో గత అయిదు సీజన్స్ నుంచి సక్సెస్ ఫుల్ గా సాగుతున్న సంగతి తెలిసిందే. సుడిగాలి సుధీర్ హోస్ట్ గా ఇటీవల అయిదవ సీజన్ ఫుల్ కామెడీగా సాగి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలో సర్కార్ సక్సెస్ పార్టీ కూడా నిర్వహించారు.(Sudigali Sudheer)

అయితే ఈసారి సర్కార్ షోలో సెలబ్రిటీలు వచ్చి ఆడటమే కాదు షో జరిగే సమయంలో గెస్టులతో పాటు ప్రేక్షుకులకు కూడా కొన్ని ప్రశ్నలు అడగడం, వాళ్ళు వాట్సాప్ ద్వారా సమాధానాలు పంపడం జరిగింది. అలా సమాధానాలు పంపిన వారిలో గెలిచిన వారికి ఇటీవల సక్సెస్ మీట్ లో ఎలెక్ట్రిక్ బైక్స్ ని అందచేసింది.

Also Read : Kanya Kumari : ‘కన్యా కుమారి’ మూవీ రివ్యూ.. విలేజ్ ప్రేమకథ.. హీరోయిన్ అదరగొట్టేసిందిగా..

ఆహా గేమ్ షో సర్కార్ లో గెలిచిన ఇద్దరికి ఫ్రాంక్లిన్ ఈవీ బైక్స్ ను హోస్ట్ సుడిగాలి సుధీర్ చేతుల మీదుగా అందజేశారు.