Sudigali Sudheer – Rashmi : ‘జబర్దస్త్’కి తిరిగొచ్చిన సుడిగాలి సుధీర్.. ఏడ్చేసిన రష్మీ.. ప్రోమో వైరల్..

జబర్దస్త్ అంటే ముందు గుర్తొచ్చేది సుడిగాలి సుధీర్ - రష్మీ జంట. (Sudigali Sudheer - Rashmi)

  • Updated on- August 31, 2026 / 08:26 PM IST

Sudigali Sudheer Rashmi

Sudigali Sudheer – Rashmi : జబర్దస్త్ కామెడీ షో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఈ షో నుంచి ఎంతోమంది కమెడియన్స్, రచయితలు, దర్శకులు వచ్చారు. ఎంతోమంది సెలబ్రిటీ స్టేటస్ తెచ్చుకున్నారు. సుడిగాలి సుధీర్ ఒక చిన్న ఆర్టిస్ట్ గా వచ్చి బుల్లితెర స్టార్ గా ఇక్కడ్నుంచే ఎదిగాడు. అయితే ఇటీవల కాలంలో చాలా మంది జబర్దస్త్ ని వదిలేసి వెళ్లిపోయారు. కొత్తవాళ్లు వచ్చారు.

జబర్దస్త్ అంటే ముందు గుర్తొచ్చేది సుడిగాలి సుధీర్ – రష్మీ జంట. వీళ్ళిద్దర్నీ జంటగా చూపిస్తూ ఎన్నో లవ్ ట్రాక్స్ నడిపారు, కామెడీ చేసారు, స్పెషల్ షోలు చేసారు. ఈ జంటకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీళ్లిద్దరి లవ్ ట్రాక్స్ టీవిలో, యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. వీరిద్దరి మధ్య కూడా మంచి అనుబంధం ఏర్పడింది. ఒకానొక సమయంలో వీళ్ళు నిజంగానే లవ్ చేసుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటారు అని వార్తలు కూడా వచ్చాయి. అయితే సుధీర్ కొన్నాళ్ల క్రితం జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయి సినిమాలు, వేరే ఛానల్స్ లో షోలు చేసుకుంటున్నాడు. రష్మీ మాత్రం ఇంకా జబర్దస్త్ లో యాంకర్ గానే కొనసాగుతుంది. తాజాగా సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది జబర్దస్త్ కి తిరిగొచ్చారు.

Also Read : Patas Praveen : తండ్రి కాబోతున్న జబర్దస్త్ కమెడియన్.. వీడియో షేర్ చేసిన భార్య..

ఓ స్పెషల్ ఎపిసోడ్ కోసం వీళ్ళు ముగ్గురూ తిరిగొచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేసారు. సుధీర్, గెటప్ శ్రీను ఎప్పట్లాగే పంచులు వేస్తూ నవ్వించారు. రష్మీతో కలిసి కామెడీ చేసాడు సుధీర్. అయితే చివర్లో రష్మీ.. తను, సుధీర్ ఒకేసారి జబర్దస్త్ మొదలుపెట్టామని, తను వెళ్లిపోయాడని చెప్తూ ఎమోషనల్ అయి ఏడ్చేసింది. మరి రష్మీ ఇంకేం మాట్లాడింది, సుధీర్ ఎలా రియాక్ట్ అయ్యాడో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే. ఈ ఫుల్ ఎపిసోడ్ సెప్టెంబర్ 6 ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈటీవీలో టెలికాస్ట్ అవ్వనుంది.