Sugriva Trailer: ఆకట్టుకుంటున్న ‘సుగ్రీవ’ ట్రైలర్.. ఏప్రిల్ 24న థియేటర్లలోకి వస్తున్న మూవీ

సుగ్రీవ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్(Sugriva Trailer) విడుదల చేసిన మేకర్స్.

Sugriva movie hitting theaters on April 24th.

Sugriva Trailer: బాలు చరణ్, కాజల్ తివారి జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ “సుగ్రీవ”. ఎస్ జి ఎస్ వి మూవీస్ బ్యానర్‌పై ఎం. పవన్ కుమార్ నిర్మించిన ఈ సినిమాను నర్తు చిరంజీవి తెరకెక్కించాడు. సస్పెన్స్, యాక్షన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్‌(Sugriva Trailer)ను విడుదల చేశారు మేకర్స్. సరికొత్తగా ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచింది.

Salaar 2: అది కదా అసలైన ఊచకోత.. సలార్ 2 పై ఇండస్ట్రీని షేక్ చేస్తున్న క్రేజీ అప్‌డేట్!

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 24న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల కానుంది. ఒక సంతోషకరమైన కుటుంబంలో అనుకోని సమస్యలు ఎదురైనప్పుడు, వారు వాటిని ఎలా అధిగమించారనే పాయింట్‌తో కథ సాగుతుంది. గోవా, వైజాగ్ వంటి అందమైన ప్రాంతాల్లో పాటల చిత్రీకరణ జరగగా, సారధి స్టూడియోస్‌లో డీఐ పనులు పూర్తి చేసుకుంది.

నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా నిర్మించిన ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. దర్శకుడు చిరంజీవి అద్భుతమైన ప్రతిభతో సినిమాను మలిచారని, ఈ కుటుంబ కథా చిత్రం ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని బృందం భావిస్తోంది. ఏప్రిల్ 24న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది.