Suhas: కార్తీక్ సుబ్బరాజ్ తో సుహాస్ మూవీ.. స్వయంగా ప్రకటించిన హీరో
తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ తో సినిమా చేస్తున్న సుహాస్(Suhas).
- V Santhosh Kumar
- Published On : February 18, 2026 / 07:25 AM IST
Suhas doing a film with Tamil star director Karthik Subbaraj.
Suhas: టాలీవుడ్ నటుడు సుహాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అతను ఎలాంటి నటుడు అనేది అందరికీ తెలుసు. షార్ట్ ఫిలిం నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ నటుడు తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు. సుహాస్ నటించిన కలర్ ఫోటో, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లాంటి సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇక తాజాగా ఈ హీరో నటిస్తున్న సినిమా ‘హే బల్‌వంత్’. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు గోపి ఆచార్య తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలోనే ప్రమోషన్స్ లో భాగంగా మీడియా మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ సందర్బంగా హీరో సుహాస్(Suhas) మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
Buchibabu Sana: పెద్ది డైరెక్టర్ కి శివన్న స్పెషల్ గిఫ్ట్.. బుచ్చిబాబు ఎమోషనల్ ట్వీట్
మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని చాలా గ్యాప్ తీసుకొని హే బల్‌వంత్ సినిమా చేశాను. అన్ని సినిమాలకు వందశాతం కష్టపడతాం. కానీ, కొన్నిసార్ల ఫలితం వేరేలా ఉంటుంది. మళ్ళీ కొత్త సినిమాతో అలరించాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఈ హే బల్‌వంత్ మూవీ తప్పకుండా నచ్చుతుంది అనే నమ్మకం ఉంది. కెరీర్ పరంగా చాలా సంతృప్తిగా ఉన్నాను. మంచి సినిమాలు చేస్తున్నాను. ప్రస్తుతం తమిళ్ లో మందాడి అనే సినిమా చేస్తున్న. అలాగే స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు తో ఓ సినిమా చేస్తున్.
ఆ సినిమాకు ఆయనే స్వయంగా కథ అందిస్తున్నాడు. కార్తీక్ సుబ్బరాజు అసిస్టెంట్ ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో, సుహాస్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కార్తీక్ సుబ్బరాజు సినిమాల గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆయన జిగర్తాండ, పేట, లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేశాడు. కాబట్టి, ఆయన సుహాస్ తో చేస్తున్న సినిమా హిట్ అయితే మాత్రం సుహాస్ తమిళం లో కూడా బిజీ అవడం ఖాయం.
