Oh Bhama Ayyo Rama Glimpse : సుహాస్ ఓ భామ అయ్యో రామా మూవీ గ్లింప్స్ వచ్చేసింది..

మాళవిక, సుహాస్ జంటగా నటిస్తున్న ఓ భామ అయ్యో రామా సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసారు మేకర్స్.

Suhas Oh Bhama Ayyo Rama Glimpse released

Oh Bhama Ayyo Rama Glimpse : ఇప్పటి వరకు వైవిధ్యభరిత కథలను ఎంచుకుంటూ ఆకట్టుకుంటున్న సుహాస్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా ఆయన ఓ భామ అయ్యో రామా సినిమాను ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన పోస్టర్ విడుదల చెయ్యగా నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో ‘జో’ బ్యూటీ మాళవిక హీరోయిన్ గా నటిస్తుంది.

Also Read : Suriya 44 : సూర్య 44 టైటిల్ టీజర్ వచ్చేసింది.. టైటిల్ అదిరిందిగా..

అయితే తాజాగా మాళవిక, సుహాస్ జంటగా నటిస్తున్న ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసారు మేకర్స్. ఇక గ్లింప్స్ చూస్తుంటే లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది. టీజర్ లో హీరోయిన్ మాళవిక సుహాస్ చెయ్యి పట్టుకొని కార్ లో కూర్చోపెడుతుంది. ఓ రాజ కోట ముందు ఇది జరుగుతుంది. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని అప్డేట్స్ రావాల్సి ఉన్నాయి. ఓ భామ అయ్యో రామా గ్లింప్స్ మీరు కూడా చూసెయ్యండి..