Suriya 44 : సూర్య 44 టైటిల్ టీజర్ వచ్చేసింది.. టైటిల్ అదిరిందిగా..
సూర్య హీరోగా తన 44వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Surya 44 title teaser released video goes viral
Suriya 44: సూర్య హీరోగా తన 44వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతుంది. అయితే తాజాగా నేడు క్రిస్మస్ సందర్బంగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సూర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ టీజర్ విడుదల చేశారు.
Also Read : Sandhya Theatre Incident : తొక్కిసలాట కాదట.. రేవతి చనిపోవడానికి అసలు కారణం ఇదే..
సూర్య నటిస్తున్న ఈ సినిమాకి “రెట్రో” అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయ్యింది. కాగా ఈ సినిమా టీజర్ ట్రైలర్ చూస్తుంటే ప్రేమ, యుద్ధం నేపథ్యంలో రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఇందులో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. టీజర్ లో సూర్య.. “నాది స్వచ్ఛమైన ప్రేమ” అనే డైలాగ్ చెప్పడంతో టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. టీజర్ మీరు కూడా చూసెయ్యండి…