Suhas : తమిళ సినిమా కోసం లైఫ్ ని రిస్క్ లో పెట్టిన సుహాస్.. జస్ట్ మిస్..

తమిళ్ స్టార్ కమెడియన్ సూరి హీరోగా చేస్తున్న మండాడి సినిమాలో సుహాస్ మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. (Suhas)

  • Published on- September 2, 2026 / 08:34 AM IST

Suhas

Suhas : షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు హీరోగా, విలన్ గా వరుస సినిమాలు చేస్తున్నాడు సుహాస్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఎదిగాడు సుహాస్. ఇన్నాళ్లు తెలుగు సినిమాలతో మెప్పించిన సుహాస్ ఇప్పుడు తమిళ్ సినిమాలో విలన్ గా చేస్తున్నాడు.

తమిళ్ స్టార్ కమెడియన్ సూరి హీరోగా చేస్తున్న మండాడి సినిమాలో సుహాస్ మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 10న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. సముద్రంలో పడవల పోటీ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుహాస్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా కోసం చేసిన రిస్క్ లను తెలిపాడు.

Also See : Karthika Deepam : కార్తీక దీపం కొత్త విలన్ ‘మాలిని’.. తేజస్విని ప్రకాష్ ఫొటోలు..

సుహాస్ మాట్లాడుతూ.. ఈ సినిమా క్లైమాక్స్ దాదాపు 45 రోజులు షూట్ చేసాం. 45 రోజుల క్లైమాక్స్ మొత్తం సముద్రంలోనే తీశారు. ఆ టైమ్ లో బోట్స్ తిరగబడడం లాంటి ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. ఓ నాలుగు అయిదు సార్లు ఆల్మోస్ట్ ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. నాతో పాటు ఇంకొంతమంది ఇక అయిపోయాం అనుకున్నాం. కానీ జస్ట్ మిస్ బయటపడ్డాం. ఒక సీన్ లో అయితే ఆల్మోస్ట్ కాలు బోట్ ప్రొపెలెర్ వరకు వెళ్ళింది. అందులోకి వెళ్లి ఉంటే కాలు విరిగిపోయేది. నాతో పాటు సూరి అన్న, అందరూ చాలా రిస్క్ చేసే ఈ సినిమాని చేసాం అని తెలిపారు.

మరి సుహాస్ ఇంత రిస్క్ చేసి మరీ చేసిన మండాడి సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.