Suhas : హీరో లిప్ లాక్ సీన్ చూసి భార్య ఏమందంటే..

తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో సుహాస్ ని ఈ లిప్ లాక్ గురించి ప్రశ్నించి మీ వైఫ్ పెర్మిషన్ తీసుకున్నారా, ఏమన్నారు అని అడగ్గా

Suhas : హీరో లిప్ లాక్ సీన్ చూసి భార్య ఏమందంటే..

Suhas Wife Reaction on Suhas Intimacy Scenes in Movie

Suhas : ఇటీవల సినిమాల్లో లిప్ లాక్ సీన్స్ చాలా కామన్ అయిపోయాయి. పెళ్లి అయిన హీరోలు అయినా, పెళ్లి కానీ హీరోలు అయినా లిప్ లాక్ సీన్స్ చేసేస్తున్నారు. హీరోయిన్స్ ఓకే అంటే కమర్షియల్ యాంగిల్లో కొంతమంది కావాలని ఈ సీన్స్ పెడుతున్నారు కూడా. ఇక తెరపై హీరోలు, హీరోయిన్స్ లిప్ లాక్ సీన్స్ చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ రియాక్షన్స్ ఏంటి? వాళ్ళ వైఫ్ ఏమంటుంది అనే ప్రశ్నలే వస్తాయి.

ప్రస్తుతం వరుస సినిమాలతో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న సుహాస్ మొదటిసారి తన రాబోయే సినిమాలో లిప్ కిస్ పెట్టాడు. ఇటీవల అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాతో మంచి విజయం సాధించి హ్యాట్రిక్ హిట్ కొట్టిన సుహాస్ త్వరలో మే 3న ‘ప్రసన్న వదనం’ సినిమాతో రాబోతున్నాడు. సుకుమార్ శిష్యుడు అర్జున్ దర్శకత్వంలో సుహాస్ హీరోగా పాయల్ రాధాకృష్ణ, రాశీసింగ్ హీరోయిన్స్ గా ఫేస్ బ్లైండ్ అనే కాన్సెప్ట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రసన్న వదనం సినిమా రాబోతుంది. ఈ సినిమాలో మొదటిసారి లిప్ కిస్ చేసానని గతంలో చెప్పాడు సుహాస్. ఈ సినిమాలో హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ తో ఈ లిప్ కిస్ సీన్ ఉండబోతుందని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.

Also Read : Shalini – Ajith Kumar : అజిత్ బర్త్ డేకి భార్య షాలిని ఇచ్చిన గిఫ్ట్ అదిరిందిగా.. భర్తకు ఇష్టమని..

తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో సుహాస్ ని ఈ లిప్ లాక్ గురించి ప్రశ్నించి మీ వైఫ్ పెర్మిషన్ తీసుకున్నారా, ఏమన్నారు అని అడగ్గా సుహాస్ సమాధానమిస్తూ.. మా వైఫ్ ఆల్రెడీ సినిమా చూసింది. లిప్ లాక్ సీన్ చూసి ఊ.. (ఎంజాయ్ చేస్తున్నావ్ గా అన్నట్టు) ఓ ఎక్స్‌ప్రెషన్ చూపించి అలా అంది అని తెలిపాడు. పైగా మా ఆవిడ నేను సరిగ్గా యాక్టింగ్ చేయను, మంచిగా చెయ్యి అంటూ తిడుతుంది అని తెలిపాడు. దీంతో వాళ్ళ ఆవిడ సుహాస్ కి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ సుహాస్ ప్రెస్ మీట్ లో చేసి చూపించడంతో అందరూ నవ్వేశారు.

ఇక సుహాస్ లలిత అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఎప్పట్నుంచో ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ సుహాస్ కెరీర్ మొదట్లోనే పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీళ్లకు ఒక బాబు కూడా ఉన్నాడు.