Shalini – Ajith Kumar : అజిత్ బర్త్ డేకి భార్య షాలిని ఇచ్చిన గిఫ్ట్ అదిరిందిగా.. భర్తకు ఇష్టమని..
అజిత్ భార్య షాలిని తన భర్త పుట్టిన రోజుకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది.

Shalini gives a Special Birthday Gift to her Husband Ajith Kumar
Shalini : తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క తనకి ఇష్టమైన బైక్ రైడింగ్ తో ప్రపంచ యాత్రలు చేస్తూ ఉంటారు. నేడు అజిత్ కుమార్ పుట్టిన రోజు. తమిళ్ లో అజిత్, విజయ్ ఇద్దరికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువని తెలిసిందే. మరి స్టార్ హీరో పుట్టిన రోజు అంటే ఏ రేంజ్ లో సెలబ్రేట్ చేస్తారు అభిమానులు. అందుకే ఫ్యాన్స్ రీ రిలీజ్ సీనియాలతో, థియేటర్స్ లో, బయట కేక్ కటింగ్స్ తో, కొంతమంది సేవా కార్యక్రమాలతో అజిత్ బర్త్ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
Also Read : Nikhil Siddhartha : హీరో నిఖిల్ అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేసాడని తెలుసా? ఏ సినిమాకి అంటే..
ఈ క్రమంలో అజిత్ భార్య షాలిని తన భర్త పుట్టిన రోజుకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది. అజిత్ కి బైక్స్ అంటే బాగా ఇష్టమని తెలిసిందే. దీంతో షాలిని ఓ లేటెస్ట్ మోడల్ డుకాటి బైక్ ని అజిత్ కి గిఫ్ట్‌గా ఇచ్చింది. ఇది అజిత్ 53వ పుట్టిన రోజు అవ్వడంతో బర్త్ డేకి తగ్గట్టు రూమ్ డెకరేషన్ చేయించి, బెలూన్స్, 53 నంబర్ లైటింగ్ తో పెట్టి వాటి మధ్యలో డుకాటి బైక్ ని పెట్టింది. దీంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#ShaliniAjithKumar gifted a Dukati bike to AK on his birthday special ??️#HBDAjithkumar#beziquestreams #ajithkumar #shalini #bike #birthday #gift #kollywood #kollywoodcinema #kollywoodmovie #tamilmovie pic.twitter.com/AhLKfL8P2a
— Bezique Streams (@BeziqueStreams) May 1, 2024
ఇక అజిత్ అభిమానులు షాలిని ఇచ్చిన గిఫ్ట్ అదిరిపోయిందని అభినందిస్తూ అజిత్ కి పుట్టినరోజు శుభాకాంక్షకులు తెలుపుతున్నారు. ఇక గత సంవత్సరం సంక్రాంతికి తూనివు సినిమాతో పలకరించిన అజిత్ చేతిలో ప్రస్తుతం విడా ముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు ఉన్నాయి.
#Shalini Mam gifted a Dukati bike to AK on his birthday special ?️#HBDAjithkumar pic.twitter.com/S8yCdi6WBY
— RENGASAMY MOVIE UPDATE (@RENGASAMY_IAM) May 1, 2024