Nikhil Siddhartha : హీరో నిఖిల్ అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేసాడని తెలుసా? ఏ సినిమాకి అంటే..

నిఖిల్ కెరీర్ సంబరం సినిమాలో ఓ చిన్న రోల్ తో మొదలైంది. హ్యాపీడేస్ సినిమాతో నిఖిల్ కి గుర్తింపు వచ్చింది.

Nikhil Siddhartha : హీరో నిఖిల్ అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేసాడని తెలుసా? ఏ సినిమాకి అంటే..

Do You Know Hero Nikhil Siddhartha worked as Assistant Director for a Movie

Updated On : May 1, 2024 / 11:43 AM IST

Nikhil Siddhartha : హీరో నిఖిల్ సిద్దార్థ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. కార్తికేయ 2 పాన్ ఇండియా హిట్ తర్వాత అన్ని వరుస భారీ సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం స్వయంభు సినిమా షూట్ తో బిజీగా ఉన్నాడు నిఖిల్. నిఖిల్ కెరీర్ సంబరం సినిమాలో ఓ చిన్న రోల్ తో మొదలైంది. హ్యాపీడేస్ సినిమాతో నిఖిల్ కి గుర్తింపు వచ్చింది. అప్పట్నుంచి హీరోగా వరుసగా సినిమాలు చేసినా స్వామిరారా, కార్తికేయ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టాకే స్టార్ డమ్ వచ్చింది.

అయితే నిఖిల్ హీరో అవ్వకముందు సినీ పరిశ్రమలో పరిచయాల కోసం అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేశాడు. తాజాగా కార్తికేయ సినిమా డైరెక్టర్ చందూ మొండేటి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నిఖిల్, నేను, డైరెక్టర్ సుధీర్ వర్మ ముగ్గురం కూడా హైదరాబాద్ నవాబ్స్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాం. అప్పట్నుంచి మేము ముగ్గురం మంచి ఫ్రెండ్స్. మాతో కెమెరామెన్, డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని కూడా అప్పుడే కలిసాడు. మేము నలుగురం ఒక గ్రూప్ గా ఉండేవాళ్ళం. నలుగురం మంచి ఫ్రెండ్స్ అని తెలిపాడు.

Also Read : Chandoo Mondeti : ఎన్టీఆర్ తో పీరియాడిక్ యాక్షన్ సినిమా చేయాలి.. కథ కూడా రెడీగా ఉంది..

నిఖిల్ హైదరాబాద్ నవాబ్స్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడమే కాకుండా ఆ సినిమాలో ఓ చిన్న రోల్ కూడా చేశాడు. ఆ తర్వాత హ్యాపీడేస్ సినిమాకి సెలెక్ట్ అయ్యాడు. ఇక హైదరాబాద్ నవాబ్స్ సినిమా.. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని దందాలను కామెడీగా చూపిస్తూ తెరకెక్కింది. ఈ సినిమా 2006లో ఉర్దూ, తెలుగులో రిలీజ్ చేశారు. ఓ మోస్తరు విజయం సాధించిన ఈ సినిమాకు ఆ తర్వాత సీక్వెల్ గా 2019లో హైదరాబాద్ నవాబ్స్ 2 కూడా వచ్చింది.

Do You Know Hero Nikhil Siddhartha worked as Assistant Director for a Movie