Sujeeth : ‘బ్లడీ రోమియో’తో బిజీ అయిన సుజీత్.. ఇదయ్యాకే పవన్ కళ్యాణ్ సినిమా..

ఓజీతో ఇండస్ట్రీని షేక్ చేసిన డైరెక్టర్‌ సుజీత్ చేతిలో ప్రస్తుతం 2 ప్రస్టేజియస్‌ సినిమాలున్నాయి. (Sujeeth)

  • Published on- October 26, 2026 / 09:00 PM IST

Sujeeth

Sujeeth : ఓజీతో ఇండస్ట్రీని షేక్ చేసిన డైరెక్టర్‌ సుజీత్ చేతిలో ప్రస్తుతం 2 ప్రస్టేజియస్‌ సినిమాలున్నాయి. నాని హీరోగా బ్లడీ రోమియో, పవన్‌ కళ్యాణ్‌తో ఓజీ2 తెరకెక్కించాల్సిన ఈ డైరెక్టర్‌.. ఇన్నిరోజులు హీరోల బిజీ కారణంగా సైలెంట్‌ అయ్యారు. మొన్నటిదాకా పూర్తిగా ది ప్యారడైజ్‌ మోడ్‌లో ఫుల్‌ బిజీగా ఉన్న నేచురల్‌ స్టార్‌ నాని ఇప్పుడు ఆ ట్రాన్స్‌ నుంచి కంప్లీట్‌గా బయటివచ్చినట్లుగా తెలుస్తోంది. డైరెక్టర్‌ సుజీత్‌తో ప్రకటించిన బ్లడీ రోమియో సినిమా కోసం అల్ట్రా స్టయిలిష్‌ లుక్‌లోకి మేకోవర్‌ అయ్యారు నేచురల్‌స్టార్‌ నాని. దానికి సంబంధించిన వీడియో ఇటీవల రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

నేచురల్‌ స్టార్‌ నాని, డైరెక్టర్‌ సుజీత్‌ కాంబినేషన్‌లో వస్తోన్న బ్లడీ రోమియో సినిమా షూటింగ్‌ అక్టోబర్‌ 17 నుంచే మొదలయిందట. ఢిల్లీలో ఫస్ట్‌ షెడ్యూల్‌ మొదలుపెట్టింది సుజీత్‌ టీమ్‌. త్వరలో ఢిల్లీ షెడ్యూల్ పూర్తి కాబోతుంది. ఆ తర్వాత హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌ ప్లాన్‌ చేసినట్లు సమాచారం. ఫుడ్‌ మాఫియా బ్యాక్‌డ్రాప్‌తో వస్తోన్న బ్లడీ రోమియో సినిమాలో నాని గ్యాంగ్‌స్టర్‌, చెఫ్‌ క్యారెక్టర్‌ ప్లే చేస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు డిఫరెంట్‌ కైండ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ కూడా ఉంటుందని నాని చెప్పుకొచ్చాడు.

Also Read : Sai Pallavi : పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో సాయి పల్లవి.. నిత్యా రెడ్డిగా అదరగొట్టింది.. గ్లింప్స్ చూశారా?

బ్లడీ రోమియో షూటింగ్‌ మొదలు కావడంతో ప్రస్తుతం డైరెక్టర్‌ సుజీత్‌ ఫోకస్‌ మొత్తం నాని సినిమా మీదే అనే క్లారిటీ వచ్చేసింది. దీంతో ఈ సినిమా కంప్లీట్‌ అయిన తర్వాత 2027 ఎండింగ్‌లోనే పవర్‌స్టార్ అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఓజీ సీక్వెల్ పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. OG హిట్ తర్వాత నానితో ముందు హిట్ కొట్టి మళ్ళీ ఆ తర్వాతే పవన్‌తో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు సుజీత్.