Ram Charan- Sukumar: మళ్ళీ క్లైమాక్స్ తోనే కొడతారట.. సుకుమార్ కి ఎలా వస్తున్నాయి ఇలాంటి ఐడియాలు

సరికొత్త పాయింట్ తో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేయనున్న రామ్ చరణ్ అండ్ సుకుమార్(Ram Charan- Sukumar).

Sukumar and Ram Charan next movie climax set to surpass Rangasthalam movie

  • చరణ్, సుక్కు కాంబోలో మరో మాస్టర్‌పీస్.
  • రంగస్థలం తరహాలో క్లైమాక్స్ ట్విస్ట్.
  • టెక్నికల్ గా సరికొత్త వినూత్న పాయింట్.

Ram Charan- Sukumar: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో టాప్ మూవీ అంటే ‘రంగస్థలం’ అనే చెప్పాలి. ఆయన కెరీర్ కి ఇది ఒక మైలురాయిగా నిలిచిపోయింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సాంకేతికంగానే కాకుండా, కథాకథనాల పరంగా కూడా ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో శత్రువును ప్రాణాలతో కాపాడి, ఆపై తన చేతులతోనే అంతం చేసే రివెంజ్ డ్రామా సినిమాకు ప్రాణం పోసింది. ఈ మాస్టర్ పీస్ తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు వస్తుందా అని మెగా అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Faria Abdullah: భవిష్యత్తులో పెళ్లికి అర్థమే మారిపోతుంది.. ‘జాతిరత్నాలు’ బ్యూటీ షాకింగ్ విశ్లేషణ.

ప్రస్తుతం వీరి కలయికలో రాబోయే కొత్త చిత్రం గురించి నెట్టింట ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ‘రంగస్థలం(Ram Charan- Sukumar)’ తరహాలోనే ఈ సినిమాలో కూడా సుకుమార్ ఒక వినూత్నమైన పాయింట్‌ను ఎంచుకున్నట్లు సమాచారం. ఈసారి కూడా టెక్నికల్ అంశాల్లో రాజీ పడకుండా, చరణ్‌లోని అసలైన నటుడిని బయటకు తీసేలా పాత్రను డిజైన్ చేశారట. సుకుమార్ మార్క్ ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లేతో పాటు, ఎవరూ ఊహించని సరికొత్త కోణంలో ఈ కథ సాగుతుందని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది.

మరీ ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ ట్విస్ట్ మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయబోతోందని ఇన్ సైడ్ టాక్. ఇప్పటివరకు ఏ దర్శకుడు టచ్ చేయని ఒక యూనిక్ పాయింట్‌ను సుకుమార్ పట్టుకున్నారని, అది చరణ్ ఇమేజ్‌ను మరింత పెంచుతుందని భావిస్తున్నారు. లెక్కల మాస్టారి ఆలోచనలకు, రామ్ చరణ్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాల కోసం సినీ ప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.