Sukumar : చరణ్ సినిమా కోసం.. సుకుమార్ ఆ హీరోయిన్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా?
రంగస్థలం లాంటి రీజనల్ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వీరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. (Sukumar)
Sukumar
Sukumar : సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు. చరణ్ – బుచ్చిబాబు పెద్ది సినిమా షూటింగ్ అవ్వగానే సుకుమార్ తన సినిమాని మొదలుపెడతాడని సమాచారం. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ తప్ప ఇంకా ఏమి మొదలవ్వకపోయినా ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుంది వీళ్ళిద్దరిది అలాంటి కాంబో మరి.(Sukumar)
రంగస్థలం లాంటి రీజనల్ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వీరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల ఈ సినిమాలో రీసెంట్ కన్నడ సెన్సేషన్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది.
Also Read : Bollywood : మొన్న సల్మాన్.. ఇప్పుడు రణవీర్.. భయం గుప్పిట్లో బాలీవుడ్.. మళ్ళీ అదే గ్యాంగ్..
గతంలో రంగస్థలం సినిమాలో మొదట అనుపమ పరమేశ్వరన్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ ఏమైందో ఆమెని తప్పించి సమంతని తీసుకున్నారు. ఈ విషయంలో అనుపమ బాధపడింది కూడా. ఆ తర్వాత అనుపమ చేసిన ఓ సినిమా ప్రచారంలో సుకుమార్ రాగా.. అనుపమ మంచి నటి, ఆమెని కచ్చితంగా నా సినిమాలోకి తీసుకుంటాను అంటూ ప్రకటించి ఆమెకు మాటిచ్చాడు.

దీంతో సుకుమార్ ఆ మాట ఇప్పుడు నెరవేరుస్తాడని రామ్ చరణ్ సినిమాలో అనుపమని హీరోయిన్ గా తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. మరి ఇవి ఎంతవరకు నిజమో తెలియాలంటే ఎదురుచూడాల్సిందే.
Also Read : Anudeep : అనుదీప్ మామూలోడు కాదు.. ఫంకీ కోసం మొత్తం డైరెక్టర్స్, నిర్మాతలు అందర్నీ దించాడుగా..
