Sumanth : అసలు ఆ రెండు సినిమాలు చేసి ఉంటేనా.. ఈ హీరో కెరీర్ ఇంకోలా ఉండేది..

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమంత్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను మిస్ చేసుకున్న సినిమాల గురించి తెలిపాడు.(Sumanth)

  • Published on- July 29, 2026 / 09:48 AM IST

Sumanth

Sumanth : అక్కినేని హీరోల్లో సుమంత్ ఒకరు. కెరీర్ మొదట్లో మంచి మంచి సినిమాలతో హిట్స్ కొట్టాడు. మధ్యలో కొన్ని ఫ్లాప్స్ చూసిన సుమంత్ గత కొంతకాలంగా మాత్రం ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం అనగనగా అనే సినిమాతో వచ్చి మెప్పించిన సుమంత్ ఇప్పుడు న్యూటన్ థర్డ్ లా అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా జులై 31న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమంత్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను మిస్ చేసుకున్న సినిమాల గురించి తెలిపాడు.

Also Read : Allu Arjun : ఫ్యాన్స్ కోసం అల్లు అర్జున్ బాగానే ప్లాన్ చేసాడుగా.. ఏకంగా మూడు నుంచి అయిదు లక్షలు..

సుమంత్ మాట్లాడుతూ.. తరుణ్ చేసిన నువ్వే కావాలి సినిమాకు డైరెక్టర్ విజయభాస్కర్ మొదట నన్నే అడిగారు. కానీ అప్పుడు యువకుడు, పెళ్లి సంబంధం సినిమాలతో బిజీగా ఉండడంతో డేట్స్ కుదరక ఆ సినిమా వదులుకున్నాను. ఆ తర్వాత అల్లు అర్జున్ చేసిన దేశముదురు సినిమా కథ కూడా పూరి జగన్నాథ్ నాకే మొదట వినిపించారు. కానీ ఆ సినిమా నేను చేసి ఉంటే అంత హిట్ అయ్యేది కాదేమో. అల్లు అర్జున్‌ కి దేశముదురు సెట్ అయింది అన్నారు. అలా సుమంత్ తన కెరీర్లో రెండు బిగ్గెస్ట్ హిట్స్ ని వదులుకున్నారు.