Sandeep Kishan: ఎట్టకేలకు మొదలైన ‘పవర్ పేట’.. ఆసక్తిరేపుతున్న పోస్టర్
సందీప్ కిషన్(Sandeep Kishan) హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవర్ పేట అనే సినిమా అధికారికంగా మొదలయ్యింది.
- V Santhosh Kumar
- Published on- April 16, 2026 / 02:23 PM IST
sundeep kishan power peta movie officially started
- మొదలైన సందీప్ కిషన్ పవర్ పేట
- అధికారిక ప్రకటన చేసిన మేకర్స్
- ఏడాది చివర్లో విడుదల
Sandeep Kishan: సందీప్ కిషన్ హీరోగా ‘పవర్ పేట’ అనే సినిమా వస్తుంది అంటూ గత రెండేళ్లుగా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే, ఎట్టకేలకు గురువారం ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. సందీప్ కిషన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేస్తూ ఒక ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేశారు. చదరంగం బోర్డుపై రక్తపు మరకలు, ఒక ఎర్ర గులాబీ ఉన్న ఈ పోస్టర్ సినిమాలోని ఇంటెన్స్ ను తెలియజేస్తోంది. ప్రేమ, గౌరవం, రాజకీయాల చుట్టూ తిరిగే కథాంశంతో ఈ చిత్రం రూపొందనున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రానికి కృష్ణచైతన్య దర్శకత్వం వహిస్తుండగా, మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కృష్ణచైతన్య గతంలో రౌడీ ఫెలో, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించి దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ‘పవర్ పేట’తో మరో పవర్‌ఫుల్ కథను వెండితెరపై చూపించబోతున్నారు. త్వరలోనే ఈ చిత్రంలోని హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను వెల్లడించనున్నారు.
వాస్తవానికి ‘పవర్ పేట’ సినిమాను మొదట నితిన్‌తో చేయాలని అనుకున్నారు. కానీ, అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఆ తర్వాత విశ్వక్ సేన్ పేరు కూడా వినిపించింది, చివరకు సందీప్ కిషన్ (Sandeep Kishan)హీరోగా సినిమాను చేస్తున్నారు. యాక్షన్ అండ్ ఎమోషన్స్ కలగలిసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది చూడాలి.
