Sundeep Kishan : మొదలైన సందీప్ కిషన్ ధమాకా కాంబో సినిమా.. మళ్ళీ ఎంటర్టైన్మెంట్ షురూ..

తాజాగా నేడు డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సందీప్ కిషన్ సినిమా #SK30 వర్కింగ్ టైటిల్ తో పూజాకార్యక్రమాలు జరుపుకుంది.

Sundeep Kishan : మొదలైన సందీప్ కిషన్ ధమాకా కాంబో సినిమా.. మళ్ళీ ఎంటర్టైన్మెంట్ షురూ..

Sundeep Kishan Trinatharao Nakkina SK30 Movie started with Pooja Ceremony

Sundeep Kishan : సందీప్ కిషన్ ఇటీవలే ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఆ సినిమా తర్వాత రవితేజతో ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చన త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా, వైబ్ అనే మరో సినిమాలని ప్రకటించాడు. అలాగే తమిళ్ లో ధనుష్ సినిమాలో ఓ పాత్ర చేయబోతున్నాడు.

Also Read : Tarak Ponnappa : ‘పుష్ప 2’లో అల్లు అర్జున్‌తో నాకు ఫైట్ సీన్ ఉంది.. కానీ నాకు ఫైట్స్ రాకపోవడంతో బన్నీ ఏం చేశాడంటే..

తాజాగా నేడు డైరెక్టర్ త్రినాథరావు నక్కిన(Trinadh Rao Nakkina) దర్శకత్వంలో సందీప్ కిషన్ సినిమా #SK30 వర్కింగ్ టైటిల్ తో పూజాకార్యక్రమాలు జరుపుకుంది. దిల్ రాజు సందీప్ కిషన్ పై క్లాప్ కొట్టారు. ఈ సినిమాని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి ధమాకా సినిమాకు కథ అందించిన స్టార్ రైటర్ ప్రసన్న కుమార్ కథని అందించాడు. SK30 సినిమా కూడా కూడా కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని సమాచారం. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వనుంది.