Tarak Ponnappa : ‘పుష్ప 2’లో అల్లు అర్జున్‌తో నాకు ఫైట్ సీన్ ఉంది.. కానీ నాకు ఫైట్స్ రాకపోవడంతో బన్నీ ఏం చేశాడంటే..
తాజాగా కన్నడ నటుడు తారక్ పొన్నప్ప పుష్ప సినిమా గురించి, అల్లు అర్జున్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Kannada Actor Tarak Ponnappa Interesting Comments on Allu Arjun and Pushpa 2 Movie
Tarak Ponnappa : అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పుష్ప సినిమాకు వచ్చిన పాన్ ఇండియా స్పందనతో పుష్ప 2 సినిమాని ఇంకా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే గ్లింప్స్ రిలీజ్ చేసి ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచారు. ఇక ఈ సినిమాలో చాలామంది వేరే పరిశ్రమల నటులు కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా కన్నడ నటుడు తారక్ పొన్నప్ప పుష్ప సినిమా గురించి, అల్లు అర్జున్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. KGF తో సహా పలు కన్నడ సినిమాల్లో నటించిన తారక్ పొన్నప్ప తెలుగులో వినరో భాగ్యము విష్ణు కథ, CSI సనాతన.. లాంటి పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. పుష్ప 2 సినిమాలో తారక్ నెగిటివ్ రోల్ లో కనపడబోతున్నట్టు తెలుస్తుంది. దేవరలో కూడా తారక్ నటిస్తున్నాడు.
Also Read : Khushboo Patani : దిశాపటాని సిస్టర్ కుష్బూ పటాని గురించి మీకు తెలుసా? ఇండియన్ ఆర్మీలో 12 ఏళ్ళు సేవలు..
తాజాగా తారక్ పొన్నప్ప ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పుష్ప 2 సినిమాలో నాకు అల్లు అర్జున్ గారితో ఫైట్ సీన్ ఉంది. నాకు ఫైట్స్, స్టంట్స్ లో అంత అనుభవం లేదు. నేను ఫైట్ చేయడానికి కొంచెం తడబడ్డాను. దీంతో అల్లు అర్జున్ నాకు బాడీ పొజిషన్ ఎలా పెట్టాలి, ఫైట్స్ లో భయంకరంగా ఎలా కనపడాలి.. వీటిపై గైడెన్స్ ఇచ్చారు. డాన్స్, ఫైట్స్ లో అతని నాలెడ్జ్ చూసి నేను ఆశ్చర్యపోయాను అని అల్లు అర్జున్ పై పొగడ్తలు కురిపించాడు. దీంతో తారక్ వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో బన్నీ అభిమానులు సంతోషిస్తున్నారు. ఇక పుష్ప 2 సినిమా ఆగస్టు 15న రిలీజ్ చేయబోతున్నట్టు ఆల్రెడీ ప్రకటించారు.