Khushboo Patani : దిశాపటాని సిస్టర్ కుష్బూ పటాని గురించి మీకు తెలుసా? ఇండియన్ ఆర్మీలో 12 ఏళ్ళు సేవలు..

దిశాపటాని అక్క కుష్బూ పటాని దేశం కోసం పని చేసిందని మీకు తెలుసా?

Khushboo Patani : దిశాపటాని సిస్టర్ కుష్బూ పటాని గురించి మీకు తెలుసా? ఇండియన్ ఆర్మీలో 12 ఏళ్ళు సేవలు..

Major Khushboo Patani Sister of Bollywood Actress Disha Patani goes Viral after sharing her Army Photos

Updated On : April 23, 2024 / 10:47 AM IST

Major Khushboo Patani : బాలీవుడ్ భామ దిశాపటాని(Disha Patani) అందరికి పరిచయమే తన సినిమాలతోనే కాక సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫొటోలతో కూడా బాగా వైరల్ అవుతుంది. త్వరలో కల్కి సినిమాతో ప్రభాస్ సరసన తెలుగులో కూడా కనిపించబోతుంది దిశా. దిశాకు ఒక అక్క, తమ్ముడు ఉన్నారు. దిశాపటాని అక్క కుష్బూ పటాని దేశం కోసం పని చేసిందని మీకు తెలుసా?

దిశాపటాని అక్క కుష్బూ పటాని ఇంజనీరింగ్ అవ్వగానే దేశానికి సేవ చేయాలని ఆర్మీలో జాయిన్ అయింది. దాదాపు 12 ఏళ్ళు ఆర్మీలో పనిచేసి కుష్బూ పటాని గత సంవత్సరమే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది. కుష్బూ ఒక సాధారణ స్థాయి నుంచి మేజర్ స్థాయి వరకు ఎదిగింది. లెఫ్టినెంట్ హోదాలో పనిచేసింది. అలాగే కుష్బూ సర్టిఫైడ్ న్యూట్రీషియన్ ట్రైనర్ కూడా. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు హెల్త్ టిప్స్, యోగా, వ్యాయామం టిప్స్ చెప్తుంది కుష్బూ.

Also Read : Namrata Shirodkar : పాట్ కమ్మిన్స్‌తో నమ్రత స్పెషల్ సెల్ఫీ.. SRH‌కి సపోర్ట్ చేస్తూ పోస్ట్.. ఈసారి SRH కప్పు కొట్టినట్టేనా?

ఇటీవల కుష్బూ తను ఆర్మీలో ఉన్నప్పటి జ్ఞాపకాలను షేర్ చేస్తూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. దీంతో మరోసారి దిశాపటాని వాళ్ళ అక్క మాజీ ఆర్మీ ఆఫీసర్ అని అందరికి తెలిసేలా వైరల్ అవుతుంది.