Namrata Shirodkar : పాట్ కమ్మిన్స్‌తో నమ్రత స్పెషల్ సెల్ఫీ.. SRH‌కి సపోర్ట్ చేస్తూ పోస్ట్.. ఈసారి SRH కప్పు కొట్టినట్టేనా?

తాజాగా మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ కూడా పాట్ కమ్మిన్స్ తో ఫోటో షేర్ చేసింది.

Namrata Shirodkar : పాట్ కమ్మిన్స్‌తో నమ్రత స్పెషల్ సెల్ఫీ.. SRH‌కి సపోర్ట్ చేస్తూ పోస్ట్.. ఈసారి SRH కప్పు కొట్టినట్టేనా?

Namrata Shirodkar Shares Photos with Pat Cummins and Supports SRH

Updated On : April 23, 2024 / 10:16 AM IST

Namrata Shirodkar : నిన్న సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్‌(Pat Cummins) ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. మహేష్ సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం మెంబెర్స్ తో కలిసి ఒక ప్రమోషనల్ కంటెంట్ ని షూట్ చేసినట్లు తెలుస్తుంది. ఆ సమయంలో మహేష్ పాట్ కమ్మిన్స్‌, మరికొంతమంది SRH ప్లేయర్స్ తో దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. అలాగే మహేష్ SRH టీంకి సపోర్ట్ ఇస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఈ ఫొటోలో మహేష్ ఫుల్ హెయిర్ తో SSMB29 లుక్స్ లో కనిపించడంతో అభిమానులు మరింత సంతోషిస్తున్నారు.

తాజాగా మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ కూడా పాట్ కమ్మిన్స్ తో ఫోటో షేర్ చేసింది. నమ్రత పాట్ కమ్మిన్స్ తో సెల్ఫీ తీసుకొని ఆ ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ SRH‌కి సపోర్ట్ గా.. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. SRH రాకింగ్ అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.

అసలే ప్రస్తుతం SRH ఫుల్ ఫామ్ లో ఉంది. IPLలో వరుసగా భారీ స్కోర్స్ కొడుతూ మ్యాచ్ లు గెలుస్తుంది. ఇదే ఊపు కొనసాగితే కచ్చితంగా SRH కప్పు కొడుతుంది అంటున్నారు అభిమానులు. తాజాగా మహేష్, నమ్రత పాట్ కమ్మిన్స్ తో ఫోటోలు దిగి పోస్ట్ చేయడం, మహేష్ SRH తో ప్రమోషనల్ కంటెంట్ చేయడం, SRHకి సపోర్ట్ గా ఆపోస్టులు పెట్టడంతో మ్యూచువల్ అభిమానులు మహేష్ వరుసగా హిట్ కొట్టినట్టు ఈ సారి SRH వరుస విన్నింగ్స్ తో కప్పు కొడుతుంది అని కామెంట్స్ చేస్తున్నారు. మరి IPL2024 లో SRH ఇదే ఫామ్ కొనసాగించి కప్పు కొడుతుందా లేదా చూడాలి.

Also Read : Vishwambhara : చిరంజీవి కెరీర్లోనే ఫస్ట్ టైం.. ఒక్క ఫైట్ కోసం ఏకంగా అన్ని రోజులు.. ‘విశ్వంభర’ ప్లానింగ్ మాములుగా లేదుగా..