Sunil : లాయర్లుగా మారిన సునీల్, అక్షర గౌడ..
ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. (Sunil)
- Saketh U
- Published on- October 16, 2026 / 02:48 PM IST
Sunil
Sunil : లోమేష్ పుడిపెద్ది, జయశ్రీ జంటగా తెరకెక్కుతున్న సినిమా డ్యూ డేట్. వరిష్ స్టూడియోస్ బ్యానర్ పై పవన్ తరిగోపుల, ఏలూరు శ్రీను నిర్మాణంలో ఆనంద్.కె దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రణీత పట్నాయక్, విజ్ఞాని, అక్షరగౌడ, సునీల్, కృష్ణభగవాన్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది.
ఇటీవల కమెడియన్ కృష్ణభగవాన్ ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారు. చాలా కాలం విరామం తరువాత కృష్ణ భగవాన్ ఓ మంచి పాత్రను పోషిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్లో నటుడు సునీల్ జాయిన్ అయ్యాడు. సునీల్ ఇటీవల చేస్తున్న పాత్రలకు భిన్నంగా లాయర్ పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఆయన కెరీర్ల్ ఇదొక డిఫరెంట్ పాత్రగా ఉండబోతుంది.
Also See : Sreemukhi : పెద్దమ్మ తల్లి టెంపుల్లో యాంకర్ శ్రీముఖి.. ఫోటోలు వైరల్..
అలాగే ఈ సినిమాలో మరో కీలక లాయర్ పాత్రలో నటి అక్షర గౌడ నటిస్తుంది. తాజాగా నిర్మాతలు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజెంట్ బర్నింగ్ ఇష్యూ ఆధారంగా కమర్షియల్ కోర్ట్ రూమ్ డ్రామాగా ఈ సినిమా ఉత్కంఠభరితంగా ఉంటుంది. ప్రతి మనిషి, ప్రతి నెలా గుర్తుపెట్టుకునే డ్యూ డేట్ చుట్టు పూర్తి వాణిజ్య అంశాలతో అల్లుకున్న కథ ఇది. టైటిల్ దగ్గర నుంచి సినిమాలోని ప్రతి అంశం ప్రేక్షకులకు కొత్తదనంతో పాటు పూర్తి సంతృప్తిని కలిగించే కథ, కథనాలు ఈ సినిమాలో ఉంటాయి అని తెలిపారు.
