Sunny Deol : బాడీలు పెంచడం కాదు.. యాక్టింగ్ చేయండి.. బాలీవుడ్ హీరోలపై సన్నీ డియోల్ వ్యాఖ్యలు..
సన్నీ డియోల్ తాజాగా గదర్ 2 సినిమాతో వచ్చి మంచి విజయం సాధించాడు. ఈ సినిమా సక్సెస్ ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ఇప్పటి హీరోల కండలు తిరిగిన బాడీలపై వ్యాఖ్యలు చేశాడు సన్నీ డియోల్.
- Saketh U
- Published On : August 13, 2023 / 10:16 AM IST
Sunny Deol sensational comments on Bollywood Young Heros
Sunny Deol : గత మూడేళ్ళుగా ఫ్లాప్స్ తో గడిపేసిన బాలీవుడ్ కి ఇప్పుడిప్పుడే అడపాదడపా హిట్స్ వస్తున్నాయి. ఇలాంటి టైంలో నటిలు మంచి మంచి కథలని సెలెక్ట్ చేసుకొని ప్రేక్షకుల ముందుకి రావాలి. అయితే బాలీవుడ్ లో సిక్స్ ప్యాక్, కండలు తిరిగిన బాడీలు చూపించడం అలవాటే. ప్రతి హీరో సినిమాలో ఏదో ఒక సీన్ లో తన బాడీని చూపించడానికి ట్రై చేస్తాడు. బాలీవుడ్ హీరోలు ఇలా కండలు పెంచుకోవడానికి స్పెషల్ ఫోకస్ పెడతారు.
తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీ డియోల్ ఇప్పటి బాలీవుడ్ హీరోలపై కామెంట్స్ చేశాడు. సన్నీ డియోల్ తాజాగా గదర్ 2 సినిమాతో వచ్చి మంచి విజయం సాధించాడు. ఈ సినిమా సక్సెస్ ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ఇప్పటి హీరోల కండలు తిరిగిన బాడీలపై వ్యాఖ్యలు చేశాడు సన్నీ డియోల్.
సన్నీ డియోల్ మాట్లాడుతూ.. ఇప్పటి హీరోలు బాడీ బిల్డింగ్ కాదు నటనపై దృష్టి పెట్టాలి. మీరేమి బాడీ బిల్డర్స్ కాదు కండలు పెంచుకోవడానికి, యాక్టర్లు. బాడీ ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంటే చాలు. పాత సినిమాలు చూడండి ఎంత బాగా నటిస్తారో తెలుస్తుంది. కండలు ఉన్న వ్యక్తులకంటే బాగా నటిస్తారు అనే వ్యక్తులుగా గుర్తింపు తెచ్చుకోండి. కథలపై, నటనపై దృష్టి పెట్టండి అంటూ మాట్లాడారు. దీంతో సన్నీ డియోల్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో సంచలనంగా మారాయి. మరి దీనిపై ఇప్పటి హీరోలు ఎవరన్నా స్పందిస్తారేమో చూడాలి.
