RB Choudhary: సినీ లోకంలో తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత ఆర్.బి. చౌదరి కన్నుమూత
రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత ఆర్ బి చౌదరి(RB Choudhary) కన్నుమూత.
- V Santhosh Kumar
- Published on- May 5, 2026 / 07:13 PM IST
Super Good Films Chief RB Choudary passes away in Road Accident
RB Choudhary: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసిన ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్.బి. చౌదరి(RB Choudhary) ఉదయపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన మరణ వార్త సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దశాబ్దాల కాలంగా ఎన్నో మరపురాని చిత్రాలను నిర్మించి, ఎందరో దర్శకులను, నటీనటులను పరిశ్రమకు పరిచయం చేసిన ఆయన మరణం తీరని లోటు. తెలుగు, తమిళ భాషల్లో విజయవంతమైన కుటుంబ కథా చిత్రాలకు ఆయన కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
Tollywood Hero: ఒకప్పటి యాక్షన్ హీరో.. ఇప్పుడు ఇలా మారిపోయాడు.. వీడియో చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్
