బ్రేకింగ్ : Superstar రజనీకాంత్ కు గాయాలు

  • Publish Date - January 28, 2020 / 04:02 PM IST

సూపర్ స్టార్ హీరో రజనీకాంత్‌ గాయపడ్డారు. Bear Grylls Man vs Wild ప్రోగ్రామ్ కోసం షూటింగ్ చేస్తుండగా.. రజనీకాంత్‌కు గాయాలయ్యాయి. కర్నాటకలోని బండిపురా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో మంగళవారం(జనవరి 28,2020) షూటింగ్ జరుగుతుండగా ప్రమాదం జరిగింది. రజనీకాంత్‌ భుజానికి, కాలికి గాయాలయ్యాయి. దీంతో ఆయన షూటింగ్ రద్దు చేసుకుని చెన్నైకు వెళ్లిపోయారు. రేపటి(జనవరి 29,2020) షూటింగ్‌కు అధికారులు అనుమతి రద్దు చేశారు. 

ఈ షూటింగ్‌ కోసం కర్నాటక బండిపురా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌కి రజనీ వెళ్లారు. తన టీమ్‌తో కలిసి ప్రత్యేక హెలికాప్టర్‌లో అక్కడికి చేరుకున్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ సరిహద్దుల్లో విస్తరించిన ఈ అభయారణ్యంలో రెండు రోజుల పాటు ఈ అడ్వెంచరస్ డాక్యుమెంటరీ చిత్రీకరణకు ప్లాన్ చేశారు. రోజూ ఆరు గంటల పాటు మాత్రమే షూటింగ్‌ను నిర్వహించాల్సి ఉంటుందని కర్ణాటక అటవీ మంత్రిత్వ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇంతలోనే ఊహించని ప్రమాదం జరిగింది. రజనీ గాయపడ్డారని తెలిసి అభిమానులు ఆందోళన చెందారు.

డిస్కవరీ ఛానెల్‌లో టెలికాస్ట్ అయ్యే Man vs Wild ప్రోగ్రామ్ చాలా పాపులర్. ఈసారి సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ షో లో పార్టిసిపెట్ చేశారు. ఈ షోని మొత్తం బేర్ గ్రిల్స్‌ హోస్ట్ చేస్తారు. ఆయనకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. పర్యావరణ సంరక్షణ కాన్సెప్ట్‌తో ఈ షో ని నడిపిస్తుంటారు గ్రిల్స్.

ఇటీవలే ప్రధాని మోడీ కూడా బేర్‌ గ్రిల్స్‌తో కలిసి ఈ షో లో పాల్గొన్నారు. ప్రధాని, గ్రిల్స్.. ఉత్తరాఖండ్‌లోని జిమ్‌ కార్బెట్ నేషనల్ పార్క్‌లో సాహస యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. దాదాపు 180 దేశాల్లో మోడీ ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. తాజాగా రజనీకాంత్ కూడా గ్రిల్స్‌తో ఈ సాహస యాత్రలో భాగం అయ్యారు.

* హీరో రజనీకాంత్‌కు గాయాలు
* డాక్యుమెంటరీ షూటింగ్‌లో గాయపడ్డ రజనీకాంత్
* కాలికి, భుజానికి స్వల్ప గాయాలు
* మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రామ్‌ కోసం షూటింగ్

* బండిపురా టైగర్ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో షూటింగ్‌ జరుగుతుండగా ప్రమాదం
* షూటింగ్ రద్దు చేసుకుని చెన్నై వెళ్లిపోయిన రజనీ
* రేపటి(జనవరి 28,2020) షూటింగ్‌కు అనుమతి రద్దు చేసిన అధికారులు

Also Read : మతాచారానికి విరుద్ధంగా : ముస్లిం పెళ్లి కూతురు వరుడిని ఏం డిమాండ్ చేసిందంటే..

ట్రెండింగ్ వార్తలు