మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేసిన ట్రైలర్‌పై సూపర్ స్టార్ రెస్పాన్స్..
కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నటిస్తున్న ‘మరక్కార్’ తెలుగు థియేట్రికల్ ట్రైలర్ మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు..
- sekhar
- Published on- March 6, 2020 / 04:17 PM IST
కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నటిస్తున్న ‘మరక్కార్’ తెలుగు థియేట్రికల్ ట్రైలర్ మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు..
మాలీవుడ్ స్టార్, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ హీరోగా లెజెండరీ డైరెక్టర్ ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘మరక్కార్’. 16వ శతాబ్దం నాటి కుంజాలి మరక్కార్ అనే నావికుడి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోహన్ లాల్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుండగా కళ్యాణి ప్రియదర్శన్, ప్రభు, సునీల్ శెట్టి, అర్జున్, సుహాసిని, జై, మంజు వారియర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
శుక్రవారం సాయంత్రం ఈ సినిమా తెలుగు థియేట్రికల్ ట్రైలర్ మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సంయుక్తంగా విడుదల చేశారు. ఇక ప్రస్తుతం యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌తో దూసుకెళ్తున్న ఈ ట్రైలర్ గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా అభినందిస్తూ ఒక పోస్ట్ చేశారు.
“కలలు నిజం అయ్యాయి, మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మరక్కార్’ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అంటూ.. నటుడు మోహన్ లాల్, కెమెరామెన్ తిరుతో పాటు సినిమా యూనిట్ సభ్యులకు గుడ్‌లక్ చెప్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు పోస్ట్ చేశారు. కాగా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది…!
