×
Ad

దేవుడు శాసించాడు.. రజనీ పాటించాడు..

సూపర్ స్టార్ రజనీకాంత్ The Film Employees Federation of South India (FEFSI) కు 50లక్షల విరాళం..

  • Published On : March 24, 2020 / 07:10 AM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ The Film Employees Federation of South India (FEFSI) కు 50లక్షల విరాళం..

కరోనా వైరస్‌ప్రభావంతో ఈ నెలాఖరు వరకు సినిమా షూటింగ్‌లు ఆపివేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. చలన చిత్ర పరిశ్రమ పెద్దలు కూడా మార్చి 31వరకు షూటింగ్‌లు ఆపివేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. చిత్ర పరిశ్రమలో వివిధ శాఖలలో పనిచేస్తున్న కార్మికులను ఆదుకోవడానికి పలువురు నటీనటులు ముందుకు వస్తున్నారు.

తమిళ సినీ కార్మికులకు అండగా నిలవడానికి పలువురు సినీ ప్రముఖులు మందుకు వస్తున్నారు. షూటింగ్స్ లేక రోజు గడవడం కష్టంగా వున్న కార్మికులకు తమవంతు సహాయంగా రజనీకాంత్ రూ.50 లక్షల విరాళాన్ని ప్రకటించారు. The Film Employees Federation of South India (FEFSI) కు 50లక్షల విరాళాన్ని అందచేస్తున్నట్లు తెలిపారు సూపర్ స్టార్.

సినిమానే జీవితంగా బతుకుతున్న వివిధ శాఖలలోని కార్మికులు ఇబ్బంది పడకూడదని తనవంతుగా ఈ చిన్న సహాయం చేస్తున్నామని రజనీ అన్నారు. సీనియర్ నటులు శివకుమార్, సూర్య, కార్తీ కుటుంబ సమేతంగా ముందుకు వచ్చి FEFSI రూ.10 లక్షల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.