Supritha : నాన్న చావుని వాడుకున్నావు అన్నారు.. నాన్న ఉండుంటే.. సుప్రీత ఎమోషనల్..
తాజాగా సుప్రీత ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా తన తండ్రి చనిపోయినప్పటి సంఘటనలు గుర్తుచేసుకొని ఎమోషనల్ అయింది. (Supritha)
Supritha
Supritha : సురేఖావాణి కూతురుగా అందరికి పరిచయం అయిన సుప్రీత ప్రస్తుతం సోషల్ మీడియా, టీవీ షోలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా సుప్రీత ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన తండ్రి చనిపోయినప్పటి సంఘటనలు గుర్తుచేసుకొని ఎమోషనల్ అయింది.
సుప్రీత మాట్లాడుతూ.. నాన్న 2019లో చనిపోయారు. ఆయనకు నేనే దహన సంస్కరణలు చేశాను. ఆడపిల్ల చేయొద్దు అని చాలా మంది విమర్శించారు. మా బంధువులు కూడా చేయొద్దు అన్నారు. కానీ నేను ఆయనకు అంతిమ సంస్కారం చేశాను. అయితే అది చేసి ఆ వీడియోని నా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. అమ్మాయిలు చేయొద్దు అంటారు కానీ కొడుకు స్థానంలో చేశాను అని వీడియో పోస్ట్ చేశాను. దాన్ని కూడా విమర్శించారు.
అప్పటికి నాకు సోషల్ మీడియాలో అంత ఫాలోయింగ్ లేదు, కానీ ఆ వీడియో పెట్టినప్పుడు దాని కింద మీ నాన్న చావుని ఫాలోవర్స్ కోసం, రీచ్ కోసం వాడుకుంటున్నావు అని కామెంట్స్ చేసారు. అసలు అలా ఎలా చేస్తారు. నిజంగా మా నాన్న చావుని నేను వాడుకోవాలంటే ఇంకేదైనా చేయొచ్చు. అలాంటి వాళ్ళు ఉన్నారు. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. కానీ కొంతమంది అమ్మాయిలు నాకు మెసేజ్ చేసారు నా వీడియో చూసి ఇన్ స్పైర్ అయి వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఆ కార్యక్రమాలు చేశామని. అప్పుడు సంతోషం అనిపించింది. మా నాన్న కోరిక మేరకే నేను ఇండస్ట్రీకి వచ్చా. నాన్న దర్శకుడు కాబట్టి ఆయనే నన్ను లాంచ్ చేయాలని అనుకున్నారు. నాన్న ఉండుంటే నేను టీవీలో ఇంకా బాగా ఎదిగేదాన్ని అనుకుంటాను అని తెలిపింది.
Also See : Rashmika Mandanna : తమిళనాడు ఆలయంలో రష్మిక మందన్న.. చీరలో సాంప్రదాయంగా ఫొటోలు..
