Supritha : పాపం సుప్రీత లవ్ స్టోరీ.. బెస్ట్ ఫ్రెండ్ అన్నయ్యను లవ్ చేస్తే..
తాజాగా ఓ టీవీ షోకి వచ్చిన సుప్రీత తన లవ్ స్టోరీ గురించి చెప్పింది. (Supritha)
- Saketh U
- Published on- July 31, 2026 / 09:29 PM IST
Supritha
Supritha : నటి సురేఖవాణి కూతురుగా సుప్రీత సోషల్ మీడియాతో ఫేమ్ తెచ్చుకున్నా ఇటీవలే హీరోయిన్ గా కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. రెగ్యులర్ గ పలు టీవీ షోలలో కనిపిస్తూ, సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ వైరల్ అవుతుంది సుప్రీత. తాజాగా ఓ టీవీ షోకి వచ్చిన సుప్రీత తన లవ్ స్టోరీ గురించి చెప్పింది.
Also Read : Vaishnavi Chaitanya : లండన్‌లో ఎంజాయ్ చేస్తున్న ‘బేబీ’.. వైష్ణవి చైతన్య సింపుల్ లుక్స్..
సుప్రీత మాట్లాడుతూ.. మా అపార్ట్మెంట్స్ లోనే నా లవ్ స్టోరీ. అతను పై ఫ్లోర్ లో ఉండేవాడు. నేను కింద ఫ్లోర్ లో ఉండేదాన్ని. అతను ఉదయం 7.30 కి కాలేజీకి వెళ్ళేవాడు. నా కాలేజీ బస్సు 8 గంటలకు. కానీ రోజూ అతని కోసం 7.30 కి కిందకు వెళ్లి కుర్చునేదాన్ని. మా అమ్మ ఏమో కింద పిల్లలతో ఆడుకుంటాను అనుకునేది. అతను నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య. నేను అతన్ని అన్నయ్య అనుకోకపోయినా చెల్లి బెస్ట్ ఫ్రెండ్ అవ్వడంతో అతను చెల్లి అనుకున్నాడు. అందుకే నేను అతనికి ప్రపోజ్ చేయలేదు అని తెలిపింది.
