Supritha Surekhavani : మా అమ్మకు ఆఫర్స్ రావట్లేదు.. మాకు సొంతిల్లు కూడా లేదు.. తన ఆస్తి వివరాలు చెప్పిన సుప్రీత..
తాజాగా సుప్రీత ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా సురేఖవాణి సినిమాలు తగ్గించడంపై, తమ ఆస్తులపై స్పందించింది.(Supritha Surekhavani)
Supritha Surekhavani
Supritha Surekhavani : సురేఖవాణి కూతురుగా అందరికి పరిచయం అయిన సుప్రీత ప్రస్తుతం సోషల్ మీడియా, టీవీ షోలతో దూసుకుపోతుంది. హీరోయిన్ గా కూడా సినిమాలు చేస్తుంది. తాజాగా సుప్రీత ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా సురేఖవాణి సినిమాలు తగ్గించడంపై, తమ ఆస్తులపై స్పందించింది.
Also Read : Supritha : నాన్న చావుని వాడుకున్నావు అన్నారు.. నాన్న ఉండుంటే.. సుప్రీత ఎమోషనల్..
సుప్రీత మాట్లాడుతూ.. అందరూ మా అమ్మ సినిమాలు చేయడం మానేసింది అంటున్నారు కానీ ఆమె మానలేదు. మా అమ్మకు ఆఫర్స్ రావట్లేదు అనేది నిజం. కొత్త ఆర్టిస్టులు వచ్చారు. పాత ఫేస్ లు ఎందుకు అనుకుంటున్నారు. పాత జనరేషన్ వాళ్లకు చాలా మందికి ఆఫర్స్ లేవు. దర్శకులు కనికరించి ఆఫర్స్ ఇస్తారేమో చూడాలి. కొంతమంది మేము సెటిల్ అయిపోయాము, అమ్మ సెటిల్ అయిపొయింది అని కూడా పిలవట్లేదు.
కానీ మేము ఇంకా సెటిల్ అవ్వలేదు. మేము ఉండేది రెంట్ హౌస్ లో. గతంలో రెంట్ కి వెళ్ళాక అక్కడ ఒక ఇల్లు తక్కువకు వస్తుందని emi లో కొన్నాము. కానీ మళ్ళీ అది అమ్మేసి అప్పు తీర్చాము. మాకు ఉన్న కార్లు కూడా emi లోనే. ఒకేసారి డబ్బులు మొత్తం పెట్టేసి కొనేంత లేవు మా దగ్గర. అప్పులు ఏమి లేవు. తినడానికి, ఉండటానికి, ట్రిప్స్ కి మాత్రం ఉన్నాయి. సేవింగ్స్ కూడా ఎక్కువ లేవు. నాకు వచ్చిన డబ్బులు అన్ని అమ్మకు ఇచ్చేస్తాను. నేను ఫైనాన్స్ చూడటంలో బ్యాడ్. మాకు ఒక ఇల్లు ఉండాలి హైదరాబాద్ లో. అమ్మ కోసం అయినా ఒక ఇల్లు కొనాలి. ఈ సంవత్సరంలో అడ్వాన్స్ అయినా ఇచ్చి ఇల్లు తీసుకోవాలి అని తెలిపింది.
