Supritha
Supritha : సీనియర్ నటి సురేఖవాణి ఇపుడు సినిమాలు తగ్గించింది. ఆమె కూతురు సుప్రీత ఇప్పటికే టీవీ షోస్, సోషల్ మీడియాతో బాగా పాపులారిటీ తెచ్చుకుంది. సుప్రీత ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. అమరావతికి ఆహ్వానం అనే సినిమాతో ఫిబ్రవరి 13న రానుంది.(Supritha)
ఈ సినిమా ప్రమోషన్స్ లో సుప్రీత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన తల్లి పెళ్లి గురించి మాట్లాడింది. సుప్రీత తండ్రి కొన్నేళ్ల క్రితమే మరణించారు. దీంతో సురేఖ పెళ్లిపై గతంలో వార్తలు వచ్చాయి. దీనిపై సుప్రీత స్పందించింది.
Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ 2027 సంక్రాంతి టార్గెట్.. అజ్ఞాతవాసి తర్వాత మళ్ళీ ఇప్పుడే..
సుప్రీత మాట్లాడుతూ.. మా అమ్మకు పెళ్లి చేద్దాం అనే ఆలోచన ఉంది. రీసెంట్ గా కూడా పెళ్లి చేద్దాం అని మా అమ్మతో అన్నాను. కానీ తనకి నాన్నతోనే ఆగిపోవాలని ఉంది. ఆ ప్లేస్ లో ఎవరిని రానివ్వకూడదు అనుకుంటుంది. తను నాకు చెప్పిన సమాధానం అదే. నేను పెళ్లి చేసుకునే ముందు అయినా మా అమ్మకు పెళ్లి చేయాలి అనే ఆలోచన ఉంది. మా అమ్మ వాళ్ళ మామయ్యకు కూడా చెప్పాను. వాళ్ళు కూడా ఓకే అన్నారు.
కానీ మంచి అబ్బాయి దొరకాలి, ఆమె ఓకే అనాలి, ఆమె హ్యాపీగా ఉండాలి. మా అమ్మను చాలా బాగా చూసుకోవాలి వచ్చే అతను. కాలు కూడా కింద పెట్టనివ్వకూడదు, ఆమె ఏం కోరుకున్నా ఇవ్వాలి. ఆమెని ప్రశ్నించకూడదు, ఆమె స్పేస్ ఆమెకు ఇవ్వాలి అని తెలిపింది.
Also See : Karunaa Bhushan : 20 ఏళ్ళ సీనియర్ నటి.. వర్షంలో అందాలు ఆరబోస్తున్న కరుణ భూషణ్..
అలాగే తన తల్లి సినిమాలకు గ్యాప్ ఇచ్చిన దాని గురించి మాట్లాడుతూ.. మా అమ్మ ఒకప్పుడు చాలా బిజీ ఆర్టిస్ట్. కానీ మేకప్ వేసుకొని సంవత్సరంన్నర అయిపోయిందని అమ్మ ఫీల్ అవుతుంది. ఎందుకో చాలా మంది సీనియర్స్ కి అవకాశాలు తగ్గిపోయాయి. అమ్మకు కూడా సినిమాలు చేయాలని ఉంది. కానీ ఛాన్సులు రావట్లేదు. ఏదో ఒక సినిమా అయినా చేయాలి అనిపిస్తుంది అమ్మకు అని తెలిపింది.