Suriya-Jyothika: కామాఖ్యా అమ్మవారి చెంత కోలీవుడ్ స్టార్ కపుల్.. సూర్య, జ్యోతిక డివోషనల్ పిక్స్ వైరల్

కామాఖ్యా అమ్మవారిని దర్శించుకున్న సూర్య-జ్యోతిక(Suriya-Jyothika).

Suriya and Jyothika visit Kamakhya devi temple Assam

  • సూర్య, జ్యోతిక కామాఖ్యా టెంపుల్ దర్శనం.
  • సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్.
  • అభిమానుల నుండి క్రేజీ కామెంట్స్.

Suriya-Jyothika: కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో మోస్ట్ అడోరబుల్ అండ్ క్యూట్ కపుల్‌గా సూర్య-జ్యోతిక(Suriya-Jyothika) జంటకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ ఈ ఇద్దరు ఎంతో మందికి రోల్ మోడల్‌గా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ స్టార్ కపుల్ కెరీర్ పరంగా కూడా సూపర్ ఫామ్‌లో దూసుకుపోతున్నారు. ఇటీవల సూర్య హీరోగా వచ్చిన ‘కరుప్పు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవగా, జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ‘సిస్టం’ మూవీ సైతం విమర్శకుల ప్రశంసలతో పాటు సూపర్ హిట్ సాధించి ఈ జంటకు మరిన్ని విజయాలను అందించింది.

Randeep Huda: మతాల మధ్య గొడవలు.. అందుకే ‘ఛావా’ సినిమాను రిజెక్ట్ చేశా.. రణ్‌దీప్ హుడా షాకింగ్ కామెంట్స్

వరుస సక్సెస్‌లతో జోష్‌లో ఉన్న ఈ స్టార్ జంట తాజాగా కాస్త ఆధ్యాత్మిక పర్యటనలో మునిగిపోయారు. ఇందులో భాగంగానే సూర్య, జ్యోతిక ఇద్దరూ కలిసి అస్సాంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కామాఖ్యా దేవి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈ జంట, అక్కడ కొన్ని క్లిక్స్ తీసుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో ఎంతో ప్రశాంతంగా, అందంగా కనిపిస్తున్న ఈ కపుల్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.

ఈ ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు, ఆడియన్స్ పెద్ద ఎత్తున స్పందిస్తూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. “ఎవర్ గ్రీన్ క్యూట్ జోడీ”, “సక్సెస్ తర్వాత అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం చాలా బాగుంది” అంటూ నెటిజన్లు ఈ జంటపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా విజయాలతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ ఎంతో బ్యాలెన్స్‌డ్‌గా సాగుతున్న ఈ కోలీవుడ్ స్టార్ కపుల్ ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.