Suriya : ‘రాకా’ తర్వాత ప్లాన్ చేయబోతున్న అట్లీ..? పాన్ ఇండియా రేస్ లోకి సూర్య..

అట్లీ డైరెక్షన్‌లో సూర్య సినిమా చేయబోతున్నాడనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. (Suriya)

  • Published on- August 19, 2026 / 08:06 AM IST

Suriya

Suriya : కొత్త కొత్త స్టోరీస్, ప్రయోగాలకు కేరాఫ్‌ హీరో సూర్య. ఎవరూ ట్రై చేయని కథలను తీసుకొని వాటితో సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోవడం ఆయన స్టైల్. ఈ ఏడాది కరుప్పు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సూర్య తాజాగా విశ్వనాథ్ అండ్ సన్స్‌ సినిమాతో పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాడు.

సూర్య విశ్వనాధ్ & సన్స్ సినిమా తర్వాత జీతూ మాధవన్, టీజె జ్ఞానవేల్ దర్శకత్వంలో సినిమాలు ప్రకటించాడు. ఆ రెండు సినిమాలు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. అయితే ఇప్పటివరకు తెలుగు, తమిళ్ కే పరిమితమైన సూర్య పాన్ ఇండియా రేసులోకి రాబోతున్నాడు అని సమాచారం. అట్లీ డైరెక్షన్‌లో సూర్య సినిమా చేయబోతున్నాడనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read : Irumudi Censor Report : ‘ఇరుముడి’ సెన్సార్ రివ్యూ.. ఈ సారి రవితేజ పక్కా హిట్..

తేరి, మెర్సల్, జవాన్.. ఇలా వరుసగా కమర్షియల్ హిట్స్ సాధించిన అట్లీ ఇప్పుడు అల్లు అర్జున్ తో రాకా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో భారీ హిట్ కొట్టడానికి ప్లాన్ చేస్తున్నాడు. అట్లీ రాకా సినిమా తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్ కోసం సూర్యను సంప్రదించినట్టు కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సూర్య ఇమేజ్‌కు తగ్గట్టుగా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్లాన్ చేస్తున్నారట.

సూర్య, అట్లీ కాంబినేషన్‌పై ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి మొదలైంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించేలా కథను సిద్ధం చేస్తున్నారట. సూర్య కెరీర్‌లోనే మరో భారీ చిత్రంగా నిలిచేలా బడ్జెట్, స్కేల్ విషయంలో ఎక్కడా రాజీపడకూడదని అట్లీ భావిస్తున్నట్టు టాక్‌. అయితే ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. మరి సూర్య, అట్లీ కాంబో నిజంగానే సెట్స్‌పైకి వస్తుందా..? ఇది జస్ట్ రూమరేనా అనేది మరికొంత కాలం వేచి చూడాల్సిందే. అట్లీ ప్రస్తుతం అల్లుఅర్జున్‌తో రాకా సినిమా బిజీలో ఉన్నాడు.

Also See : Ayesha Khan : నిశ్చితార్థం చేసుకున్న బోల్డ్ భామ అయేషా ఖాన్..? ఫోటోలు వైరల్.. నిజమేనా?