Kanguva Glimpse : ‘కుశలమా’ అంటూ భయపెడుతున్న సూర్య.. కంగువ గ్లింప్స్ చూశారా..?
కోలీవుడ్ హీరో సూర్య పుట్టినరోజు కావడంతో తను నటిస్తున్న పిరియాడికల్ యాక్షన్ డ్రామా కంగువ నుంచి ఫస్ట్ గ్లింప్స్ ని మూవీ టీం రిలీజ్ చేసింది.
- gum 95921
- Published On : July 23, 2023 / 06:37 AM IST
Suriya period action drama film Kanguva Glimpse released
Kanguva Glimpse : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya), తమిళ మాస్ డైరెక్టర్ శివ కంబినేషనల్ లో వస్తున్న సినిమా ‘కంగువ’. పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో బాహుబలి, KGF చిత్రాలకు తమిళ ఇండస్ట్రీ నుంచి సమాధానం చెబుతాం అంటూ మూవీ ప్రొడ్యూసర్స్ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇవ్వడంతో మూవీ ఎలా ఉండబోతుందో అని ఇతర పరిశ్రమల్లో కూడా కొంత ఆసక్తి నెలకుంది. కాగా నేడు జులై 23న సూర్య పుట్టినరోజు కావడంతో చిత్ర యూనిట్ మూవీ నుంచి గ్లింప్స్ ని రిలీజ్ చేశారు.
Nithiin 32 : నితిన్-వక్కంతం వంశీ సినిమా క్రేజీ అప్‌డేట్.. ఫస్ట్ లుక్‌కు టైమ్ ఫిక్స్
దాదాపు 2 నిమిషాలు పాటు ఉన్న గ్లింప్స్ లో కంగువ టైటిల్ సాంగ్ తో నడిపించారు. యుద్ధ సన్నివేశాలు చూపిస్తూ గ్లింప్స్ చివరిలో సూర్య.. ‘కుశలమా’ అంటూ వైల్డ్ గా అడుగుతూ బయపెడుతున్నాడు. మొత్తానికి గ్లింప్స్ ఆడియన్స్ ని ఆకట్టుకునే లాగానే ఉంది. అడివి వీరుడు సూర్య కనిపించబోతున్నాడు. దానికి తగ్గట్టే సూర్య లుక్స్ చాలా వైల్డ్ గా ఉన్నాయి. కాగా ఈ సినిమాలో సూర్య మొత్తం ఐదు పాత్రల్లో కనిపించబోతున్నాడని తెలుస్తుంది. దీంతో మూవీ పై మరింత హైప్ క్రియేట్ అవుతుంది.
Bro Trailer : బ్రో ట్రైలర్ ఆగయా.. మామా అల్లుడు కుమ్మేసారుగా..
ఈ సినిమాని స్టూడియో గ్రీన్, యువీ క్రియేషన్స్ బ్యానర్స్ కలిసి దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని (Disha Patani) ఈ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ గోవా, కేరళ, కొడైకెనాల్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటుంది. జగపతిబాబు, కే ఎస్ రవికుమార్, యోగిబాబు, కోవై సరళ తదితరులు ప్రధాన పత్రాలు పోషిస్తున్నారు. మొత్తం పది భాషల్లో ఈ సినిమాని 2024 ఫస్ట్ హాఫ్ లో తీసుకు రాబోతున్నారు.
